తెలంగాణ

వ్యవసాయంపై పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: రైతులకు 2018-19 యాసంగి పంటకోసం రుణాలు ఇవ్వడాన్ని బ్యాంకులు నిలిపివేశాయి. వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ఈ యాసంగికి పంట రుణాలుగా 10,385 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 10 శాతం రుణాలు కూడా ఇవ్వలేదు. వాస్తవంగా ఇప్పటి వరకే 50 శాతం రుణాలను ఇవ్వాల్సి ఉంది. అలాగే వ్యవసాయ టర్మ్‌లోన్స్, వ్యవసాయ అనుబంధ రంగాలకు 10,972 కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. వార్షిక రుణ ప్రణాళిక ఖరారైన సమయానికి తెలంగాణ శాసనసభకు ఎన్నికల కార్యక్రమం ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ ఆరోతేదీన అసెంబ్లీ రద్దు చేయడంతో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఆ తర్వాతే యాసంగి సీజన్ ప్రారంభమైంది. రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను ఒకే దఫా మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, టీఆర్‌ఎస్ కూడా వ్యవసాయ రుణమాఫీపై ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేందుకు రైతులు పెద్దఎత్తున బ్యాంకులను సంప్రదించారు. గతంలో జరిగిన రుణమాఫీ వల్ల బ్యాంకులు కొంత కాలం పాటు ఆర్థిక సంక్షోభానికి గురయ్యాయి. తాజా సమాచారం ప్రకారం బ్యాకులకు రైతులు చెల్లించాల్సిన వివిధ రకాల రుణాలు 90 వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఔట్‌స్టాండింగ్ రుణాలే.
రుణమాఫీ చేస్తామంటూ రాజకీయ పార్టీలు ప్రకటించడం వల్ల బ్యాంకు లనుండి రుణాలు తీసుకున్న రైతులు వాటిని తిరిగి చెల్లించేందుకు ఇష్టపడరన్నది బ్యాంకర్ల భావన. వాస్తవంగా రైతులు సకాలంలోనే బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లిస్తుంటారు. రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలతో రైతుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. యాసంగి పంటల కోసం బ్యాంకులకు వెళుతున్న రైతులకు ‘రుణాలు ఇవ్వడం కొంతకాలం పాటు ఆపివేశాం’ అన్న సమాధానం లభిస్తోంది.
ఇలా ఉండగా దాదాపు ప్రధానమైన బ్యాంకులన్నీ రైతుబంధు పథకం అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించాయి. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద దాదాపు 6000 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమచేసింది. ఈ డబ్బును రైతులకు చెల్లించేందుకు బ్యాంకర్లకు సమయం చాలడం లేదని తెలుస్తోంది.