తెలంగాణ

రాజకీయ లబ్ధికి టీఆర్‌ఎస్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అధర్మాన్ని పెంచి పోషించే విధంగా ఉందని ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం, ఫోన్ ట్యాపింగ్‌లు, నేతల వాహనాలు ఆపి సోదాలు చేయించడం తద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారని టీటీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధులు డబ్బును, మద్యంను సరఫరా చేస్తున్నారని దీనిని నిఘా వర్గాలు అడ్డుకోకుండా ప్రజాబలమే ఆయుధంగా వెళ్తున్న విపక్షాల నేతలను ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో, 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఒడ్డున పడ్డారని, ఇపుడు కుడివైపున ఎంఐఎం, ఎడమవైపున బీజేపీని పెట్టుకుని కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా? ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి కావాలా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ముసాయిపేటలో రైలు ప్రమాదం జరిగి 32 మంది పిల్లలు చనిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 34 సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రారంభించడమైందని, వాస్తవానికి రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆగలేదని, సంక్షేమ కార్యక్రమాలు ఆగాయని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, మూడెకరాల భూమి పంపిణీ, లక్ష ఉద్యోగాల భర్తీ, కేజీ టు పీజీ కార్యక్రమం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఆగిపోయాయని చెప్పారు.