తెలంగాణ

వివాదాల్లో తలదూర్చకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవల్సిన చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ఇక్కడ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పరిధిలోని సీనియర్ పోలీస్ అధికారులతో దాదాపు మూడు గంటలపాటు వివిధ అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపారు. ముఖ్యంగా అధికారులు ప్రాధాన్యత అంశాలపై లక్ష్యాలను నిర్ధేశించారు. శాంతిభద్రతలు, నేర విభాగాలు, నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సంప్రదించాలని ఆయన ఆదేశించారు. మావోస్టుల ప్రభావిత ప్రాంతల్లో బలగాల మొహరింపు, ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి పోలీసులు కృషి చేయాలన్నారు. మావోల కదలికపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్‌లో కేంద్ర బలగాల సంఖ్య పెంచుతున్నందున అక్కడి మావోస్టులు తెలంగాణ దండకారణ్యంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన విషయాన్ని డీజీపీ వివరించారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకూ అధికారులు అప్రమత్తతో ఉండాలని ఆయన ఆదేశించారు.
అలాగే సిబ్బందితో సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోవాలన్నారు. ఎన్నికల అధికారుల సూచనలతో ‘కోడ్’ అమలుకు కృషి చేయాలని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘల పట్ల సమన్యాయంగా పాటించాలని, ఎవరి పట్లా అత్యుత్సాహం చూపించి వివాదాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు. అనవసర వివాదాల్లోకి తలదూర్చి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సమస్యాత్మక ప్రాంతల్లో యాంటీ ఫోర్సు బలగాలు ఏమేరకు అవసరమో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్‌ను డీజీపీ ఆదేశించారు. పాత బస్తీలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న తప్పులకు స్థానిక రాజకీయ వర్గాల్లో గొడవలు జరుగుతున్నాయని, దీంతో అల్లర్లు జరిగే ప్రమాదం లేకపోలేదని ఆయన తెలిపారు. నేర చరిత్ర ఉన్నవాళ్లను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. నేరతీవ్రత ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలన్నారు.
కొత్తగా విధుల్లోకి చేరిన అధికారులు పైఅధికారులతో టచ్‌లో ఉండాలని సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు ఆయా జిల్లాలకు అవసరమైన కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసుల మధ్య సమాచార లోపం లేకుండా పర్యవేక్షణను వేగవంతం చేసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.

చిత్రాలు..ఎన్నికల భద్రతపై అధికారులతో సమీక్షిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, సమావేశానికి హాజరైన పోలీసు అధికారులు