తెలంగాణ

మద్యం, నగదు పంపిణీ అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోమర్ 25: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నగరా మోగినప్పటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు పోటీ పడుతూ మద్యం, డబ్బును పంపిణీ చేస్తున్నారని, దీన్ని వెంటనే అరికట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటీ(ఓయూ జేఏసీ) నేతలు ఎల్చల దత్తాత్రేయ, ఎనుగంటి రాజు నేత ఆరోపించారు. గురువారం వారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను కలిసి, వినతిపత్రాన్ని సమర్పించారు. నిజాయితీగా, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని వినతిపత్రంలో కోరినట్లు వివరించారు. రజత్‌కుమార్‌ను కలిసిన ఓయూ జేఏసీ నేతల్లో చిరంజీవి బెస్త శ్రీనివాస్, వంశీకృష్ణ, నీవన్‌కుమార్, మహేశ్, మిట్టల్, రఘు, శ్రీనివాస్ తదితరులున్నారు.
ఒంటరిగానైనా బరిలో దిగుతాం
ఓయూ జేఏసీ నేతలు ఎల్చల దత్తాత్రేయ, రాజు నేత రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.