తెలంగాణ

అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: అధికార పక్షానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని మహాకూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి గురువారం నాడు ఫిర్యాదు చేశారు. మహాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్‌లు సీఈఓను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఆపద్ధర్మ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కొత్త పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాలు ప్రకటించడానికి వీలు లేదని, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు చేస్తూ, నిర్ణయాలను వెల్లడిస్తూ టీఆర్‌ఎస్ నేతలూ, ముఖ్యమంత్రి ఎన్నికల నియమ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఆపద్ధర్మ ప్రభుత్వంలో కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు తమ పరిధికి మించి టీఆర్‌ఎస్ పార్టీకి , నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల డ్యూటీలో నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం టీఆర్‌ఎస్ పార్టీకే కొమ్ముకాస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు, పార్టీ అభ్యర్థులు యధేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి పట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, కనీసం ఎన్నికల కోడ్ నిబంధనలను కూడా వారికి వర్తింపచేయడం లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు పర్యటనలను, సభలను సమావేశాలను అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. విపక్షాలకు చెందిన నాయకులపై మాత్రం ఉద్ధేశ్యపూర్వకంగా ,కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు చెందిన వ్యాపార లావాదేలు అంశాన్ని పట్టుకుని పూర్తిగా దర్యాప్తు చేయకుండానే రాజకీయ ఉద్ధేశ్యంతో టీడీపీ -టీఎస్ అధ్యక్షుడు ఎల్ రమణకు ఆపాదించే ప్రయత్నం చేశారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి, టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం వాహనాన్ని టీడీపీ టీఎస్ అధ్యక్షుడు ఎల్ రమణ వాహనాన్ని రోడ్డు మీద నిలిపి తనిఖీలు పేరిట ఇబ్బందులకు, అసౌకర్యానికి గురి చేశారని అన్నారు. గత 15వ తేదీన టీఆర్‌ఎస్ నాయకుడు పల్లె గోపాల్ అనే వ్యక్తి వాహనంలో 27.35 లక్షలు తరలిస్తూ పట్టుబడితే దానిని మీడియా చానళ్లలో చూపించలేదని, సాక్షాత్తు నాయని నర్సింహారెడ్డి ముషీరాబాద్ నుండి కాకుండా వేరే అసెంబ్లీ నుండి పోటీ చేస్తే 10 కోట్లు తనకు ఇస్తానని కేసీఆర్ పేర్కొన్నారని చెప్పారని ఈ అంశంపై ఎన్నికల సంఘం సూమోటో కింద కేసు నమోదు చేయాలని మహా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారులపై , అధికార యంత్రాంగంపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
చిత్రం..ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు వినతి పత్రం ఇస్తున్న కూటమి నేతలు