తెలంగాణ

ఎన్నికలు బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 25: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు జయశంకర్ భూపాలపల్లి,మహబూబూబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. గురువారం ఆంధ్రభూమి కార్యాలయానికి ఐదు పేజీల లేఖను ఆయన పంపించారు. సీఎం కేసీఆర్ గత నాలుగు సంవత్సరాల కాలంలో నియంత పరిపాలన కొనసాగించారని ఆయన అన్నారు. 9నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు కారణం అయిన టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్నికల భారాన్ని ప్రజలపై మోపుతున్నాడని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. 2019 మే వరకు ఆగి లోక సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్‌ఎస్ పార్టీ మరింత బలహీన పడుతుందనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసులకు అధునిక సంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ వ్యవస్థ్ధకు వేలకోట్ల రూపాయలను ఖర్చుచేసి పోలీస్ వ్యవస్ధను బలోపేతం చేశారని తెలిపారు. తెలంగాణలో వేలాది మంది పోలీసులను భర్తీచేసి ప్రజా సంఘాలను అరెస్ట్‌చేసి తీవ్ర చిత్రహింసలకు గురిచేసి, హత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డరని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుందని విమర్శించారు. మంత్రుల కూడా నిర్ణయాలు తీసుకునే హక్కు లేకుండా పోయిందని అన్నారు. కేసీఆర్ నిజాంను తలదనే్నలా నియంత పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. గత 70 సంవత్సరాలుగా ప్రజలు బూర్జువా, రెవిజినిస్ట్ పార్టీలకు ఓట్లు వేస్త్తూనే ఉన్నారని అయినప్పటికీ ప్రజల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కమలాపూర్ బిల్ట్ కార్మగారాన్ని వెంటనే పునరద్దరించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల నుండి పర్మినెంట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేసారు. రామగుండం ఎరువుల కార్మాగారాన్ని పునరుద్ధరించి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.