తెలంగాణ

కూటమికి ఓటేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 25: కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షా 50వేల ఎకరాలు సస్యశ్యామలం కానుండగా, నోటికాడి బుక్క ఎత్తగొట్టేందుకే టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని ఆయన ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రయోజనం జరిగేందుకే ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తులు వేస్తుండగా, మహా కూటమికి అండగా నిలిస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని స్పష్టంచేశారు. తెలంగాణలో టీడీపీకి ముఖం లేకనే కొత్త పొత్తులకు తెరలేపగా, ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో అవకాశవాదం, అభివృద్ధికి మధ్య ఎన్నికలు జరుగుతుండగా, ప్రజలు గ్రహించి తగిన విధంగా తెలంగాణ ద్రోహులకు బుద్ధిచెప్పాలని హితవు పలికారు. అయితే, ఆంధ్రోళ్ల డబ్బులను గ్రామాల్లో వెదజల్లుతూ ప్రజలను మభ్య పెడుతుండగా, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వేసిన అక్రమ కేసులను రైతులు మర్చిపోలేదని తెలిపారు. గోదావరి జలాలతో బీడు భూములు పారిస్తూ అన్నదాతల కాళ్లు కడిగేందుకు ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, కోర్టు పక్షుల్లా మారిన కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రాలు కాపీ కొడుతుండగా, ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిపారు. కాగా, మరో ఆరు నెలల్లో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసుకొని చెరువులు, కుంటలు, వాగులు, వంపులు నీటితో కళకళలాడనుండగా, గ్రామాల్లో రైతులు బోర్లు వేసుకొని నష్టాలపాలు కావద్దని సూచించారు. పంట రుణమాఫీతో 42 లక్షల మంది రైతులకు ప్రయోజనం జరగనుండగా, పంట పెట్టుబడి రాయితీతో అదనంగా ఐదేళ్లలో లక్ష రూపాయలు రైతుల పేరిట జమ కానున్నట్లు చెప్పారు. అంతేగాకుండా మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగులు, యువత, ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన మేనిఫెస్టోతో లాభం జరగనుండగా, ఇచ్చిన మాట నెరవేర్చే సత్తా, శక్తి, యుక్తి సీఎం కేసీఆర్‌కే చెల్లిందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుదాకర్‌రెడ్డి, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మెన్ పన్యాల భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు