తెలంగాణ

కూటమితో కాంగ్రెస్ చేతిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ భస్మమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 25: 67 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మొండి చేయి చూపిందని, ఇపుడు చంద్రబాబు, కోదండరాం, సీపీఐలకు భస్మాసుర హస్తం కానుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మాజీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఎనిమిది గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి, సారంపల్లి, ఒబులాపూర్, రాళ్ళపేట, కస్బె కట్కూర్, వేణుగోపాల్‌పూర్, గండిలచ్చపేట, మండెపల్లి గ్రామాలలో సుడిగాయి పర్యటన చేసి రోడ్డు షోలు, సభల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత కాలం ప్రజలకు మొండిచేయి చూపిన కాంగ్రెస్‌తో కట్టిన మాయా కూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు భస్మం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తూ అక్కడి చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించి, మళ్ళీ కేసీఆర్‌కు అధికారం ఇవ్వాలని, లేని పక్షంలో పాత కన్నీళ్ళు, కష్టాల రోజులను ప్రజలు చవిచూడాల్సి వస్తుందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ను పోగొట్టుకుంటే పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్ కట్ చేస్తేనే మనకు కరెంటు వచ్చిందని, అందుకే మాయా కూటమికి మళ్ళీ అవకాశం ఇవ్వరాదని కోరారు. అంకిరెడ్డిపల్లెలో తమకు సాగు నీరు రావాలని మహిళలు కోరడంతో గోదావరి, కృష్ణా జలాలను త్వరలో తీసుకవస్తామని, ఈ పనులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ 200 కేసులు వేసిందన్నారు. మరో ఆరు నెలల్లో ఎగువ మానేరు నింపుతామని, అలాగే సిద్దిపేట నుండి వెళ్ళే కాలువల ద్వారా సాగు నీరందిస్తామని, అంకిరెడ్డిపల్లెలోని రెండు చెరువులు నింపుతామని వెల్లడించారు. ఇపుడు పెన్షన్లు పెంచి ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్‌లలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై వీరికి ప్రేమ లేదని, కేవలం ఓట్ల కోసమే మాయా కూటములు కట్టి మోసపు మాటలు చెబుతున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని కేటీఆర్ కోరారు. తెలంగాణలో మళ్ళీ పాగా వేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని అన్నారు. పని చేసే ప్రభుత్వానికి మద్దతు నివ్వాలని, అండగా ఉండాలని కోరారు. గ్రామాల ప్రచార పర్యటనలో పార్టీలో చేరిన వారికి కండువాలను కప్పి, ఆహ్వానించారు. ఈ కార్యక్రమాలలో తెరాస ముఖ్య నాయకులు, గ్రామాల పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్రం..పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్