తెలంగాణ

కాంగ్రెసోళ్లను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెసోళ్లను నమ్మవద్దని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ తెలంగాణ వెనుకబడిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా ఆర్మూర్‌లోని క్షత్రియ కళ్యాణ మండపంలో గొల్ల, కుర్మల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మహాకూటమి పేరిట అన్ని పార్టీలు ఒక్కటై ప్రజల వద్దకు వస్తున్నాయని, సిద్ధాంతాలు వదిలి హామీల పేరిట మోసం చేయడానికి సిద్ధమయ్యాయని ఆయన విమర్శించారు. గతంలో యాదవ, కుర్మ కులస్థులు ఎన్నికల్లోనే జ్ఞాపకం వచ్చే వారని, ఉద్యమ నేత కేసీఆర్ మాత్రం అలా కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా గొర్రెలు పంపిణీ చేశారని ఆయన గుర్తు చేశారు. 50 రోజుల్లో మరోసారి టీఆర్‌ఎస్ గెలుస్తుందని, అప్పుడు ఇంటింటికీ గొర్రెలు ఇస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గొల్ల, కుర్మలకు స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్, ఇంటింటికీ తాగునీరు ఇస్తే కాంగ్రెస్‌కు కనిపించడం లేదని, ఓర్వలేక పోతున్నారని చెప్పారు. 40 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారని అన్నారు. అందువల్ల టీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు. ప్రజలు తలెత్తుకొని తిరిగే విధంగా సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చుతున్నారని, సంపద సృష్టించి ప్రజలకు పంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆర్మూర్ నుంచి జీవన్‌రెడ్డికి మొదటి టిక్కెట్ ఇస్తే గెలిపించారని, ప్రస్తుతం మరోసారి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
జీవన్‌రెడ్డి గెలిచిన వెంటనే ఆర్మూర్‌లో సంఘం నిర్మించేలా తాను చర్యలు తీసుకుంటానని చెప్పారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ గొల్ల, కుర్మలకు 10 ఎకరాల భూమి, 200 కోట్ల నిధులు మంజూరు చేశారని ఆయన అన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను గొంగడి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి, ఆర్మూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.