తెలంగాణ

రూ.10 కోట్లపై ఐటీశాఖ కూపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 25: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ఐదు రోజుల క్రితం పోలీసుల తనిఖీల్లో ఓ కారులో పట్టుబడ్డ రూ. 10 కోట్ల హవాలా డబ్బుపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. ఆదాయపన్ను ఎగవేస్తూ కోట్లాది రూపాయల డబ్బు రాష్ట్రాల సరిహద్దుల మీదుగా రవాణా అవుతున్నట్లు నిర్ధారించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు మహారాష్టల్రోని నాగ్‌పూర్, ఇటు హైదరాబాద్ కేంద్రంలోనూ ప్రైవేట్ వ్యాపారులు, వడ్డీ దళారులపై నిఘా పెంచి తనిఖీలు ముమ్మరం చేశారు. పిప్పర్‌వాడ చెక్‌పోస్టు వద్ద మూడు బ్యాగుల్లో పోలీసులు పట్టుకున్న రూ.10కోట్ల నగదుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు లభించకపోవడంతో హవాలా డబ్బుగా గుర్తించిన పోలీసులు కారులో పట్టుబడిన ఇద్దరు నిందితులు వినోద్ శెట్టి, సర్వేష్‌కుమార్‌లపై కేసులు నమోదు చేసి డబ్బును ఆదిలాబాద్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, న్యాయస్థానం ఆధారాలు లేని ఈ డబ్బును బ్యాంకులో జమచేయాలని పోలీసులను ఆదేశించడంతో ఆదిలాబాద్ ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్‌లో జమచేశారు. రాష్ట్రాల సరిహద్దు గుండా కోట్లాది రూపాయల బినామీ డబ్బు అక్రమంగా రవాణా అవుతున్నట్లు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ కేసును తమకు అప్పగించాలని పోలీసు అధికారులకు లేఖ రాశారు. అంతేగాక కారు డ్రైవర్ వినోద్ శెట్టి ద్వారా డబ్బు వివరాలపై ఆరా తీయగా నాగ్‌పూర్‌లోని ఈత్వారీ కాలనీలోని ప్రైవేట్ లాకర్ కేంద్రం నుండి ఐదు బ్యాగుల్లో డబ్బును కారులో పెట్టారని, పూర్తి వివరాలు తనకు తెలియదని ఐటి అధికారులకు వివరించాడు. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు నాగ్‌పూర్‌లోని ప్రముఖ వడ్డీ వ్యాపార కేంద్రాలతో పాటు ప్రైవేట్ లాకర్ సెంటర్లపై ఐటి విభాగం అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనపర్చుకున్నారు. నాగ్‌పూర్‌లోని ఈత్వారీపేట్ కాలనీ సమీపంలో గల రాందాస్‌పేట్ కాలనీలోని హోటల్‌లో ఒక రోజు బస చేసి ఈత్వారీపేట్ కాలనీ ఓ ప్రైవేట్ లాకర్ కేంద్రం నుండి డబ్బులు కారులో ఎక్కించడం జరిగిందని డ్రైవర్ వివరణ ఇచ్చాడు. అయితే ఆ ప్రైవేట్ లాకర్ కేంద్రం మేనేజర్ ప్రకాష్ వాద్వానిని విచారించేందుకు ఐటి అధికారులు వెళ్ళగా ఆయన వెంటనే తప్పించుకొని ఆనారోగ్యం పేరిట ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియూలో చేరడం అలజడి రేపుతోంది. వడ్డీవ్యాపారులు బినామీ పేర్లతో ఐటీ పన్ను ఎగవేస్తూ కోట్లాది రూపాయల డబ్బును హవాల రూపంలో వివిధ రాష్ట్రాలకు అక్రమంగా చేరవేస్తున్నట్లు తేలింది. డబ్బును కారులో ఎక్కించే సమయంలో ఎవరైనా చూశారా..?, ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి ఎవరి వద్దకు వెళ్తుందో అన్న అంశంపై కూపీ లాగగా రూ.10 కోట్ల నగదుపై తమకు ఏలాంటి సంబంధం లేదని కొందరు వ్యాపారులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. పైగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డబ్బులు రవాణా ఎక్కడికి జరుగుతోంది అన్న కోణంపై విచారణ సాగిస్తున్నారు.
పిప్పర్‌వాడ వద్ద పోలీసులు మూడు బ్యాగుల్లో రూ.10కోట్ల నగదు పట్టుబడ్డట్లు చెబుతుండగా డ్రైవర్ మాత్రం ఐదు బ్యాగుల్లో డబ్బులు కారులో తీసుకొని వెళ్ళినట్లు ఐటి అధికారులకు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. మిగితా రెండు బ్యాగుల్లో డబ్బులు వెళ్ళాయా లేదా అన్న అంశాలపై దృష్టిసారించి దర్యాప్తు ప్రారంభించారు. నాగ్‌పూర్‌లో రెండు రోజుల పాటు ఆకస్మిక సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు రూ.10 కోట్ల అక్రమ రవాణాపై ఏలాంటి ఆధారాలు లభించకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లోనూ హవాల డబ్బు రవాణాపై బడా వ్యాపారులపై నిఘా పెట్టి పోలీసులు దర్యాప్తు సాగించడం విశేషం.
చిత్రం..నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ లాకర్ కేంద్రం వద్ద తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు