తెలంగాణ

టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సప్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగం
రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా
నేడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
=====================================
హైదరాబాద్, అక్టోబర్ 26: గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డిని పార్టీ నుంచి శుక్రవారం టీఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో క్రమశిక్షణా చర్య తీసుకున్నట్టు టీఆర్‌ఎస్ ప్రకటించింది. అయితే నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాతనే సస్పెండ్ చేసినట్టు టీఆర్‌ఎస్ ప్రకటించినట్టు నర్సారెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరికకు నర్సారెడ్డి రంగం సిద్ధం చేసుకోవడం వల్లనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. నర్సారెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావును కలిసి పార్టీకి, నామినేటెడ్ పదవి రెండింటికీ తన రాజీనామా లేఖను నర్సారెడ్డి అందజేసినట్టు తెలిసింది. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వకపోవడంతోనే మనస్థాపంతో రాజీనామా చేయడానికి కారణంగా నర్సారెడ్డి పార్టీ నేతల వద్ద వాపోయినట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పటి పూర్వ సంబంధాలతో ఆ పార్టీ నాయకులు ఆస్పత్రికి వచ్చి నర్సారెడ్డిని పరామర్శించారు. అప్పటి నుంచే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరిగింది.
పాత సంబంధాల కారణంగా పరామర్శించినంత మాత్రనా పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని నర్సారెడ్డి పత్రికాముఖంగా ఖండించారు కూడా. తన వివరణ తర్వాత కూడా టీఆర్‌ఎస్ అధిష్టానం సంతృప్తి చెందకపోవడంతో ఇక పూర్వశ్రమం కాంగ్రెస్‌లో చేరడమే ఉత్తమమని భావించి నర్సారెడ్డి మెదక్ మాజీ ఎంపి విజయశాంతి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి చర్చించాకే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్టు తెలిసింది. ఇలా ఉండగా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నర్సారెడ్డి శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లినట్టు తెలిసింది. రాహుల్‌గాంధీ సమక్షంలో నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిసింది. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డికి టికెట్ లభించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.