తెలంగాణ

పాఠశాల విద్య ప్రభుత్వ ఆధీనంలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: పాఠశాల విద్య ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, అపుడే ప్రయోజనం నెరవేరుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుడు బి.మన్మధరెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు ఆధీనంలో ఉండటం వల్ల విద్య కంటే వ్యాపారంపై ఎక్కవ దృష్టి ఉంటుందని, అదే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వ్యాపారం కంటే విద్యపై ఎక్కువ దృష్టి ఉంటుందని అన్నారు. అందరికీ ఉచిత విద్య అందిస్తే చాలని, ప్రజలు హర్షిస్తారని వేరే పథకాలు కూడా ప్రజలు కోరుకోరని ఆయన అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య విస్తరణ దృష్ట్యా ప్రైవేటు రంగం సహకారం తీసుకోవల్సి ఉంటుదని, కానీ పాఠశాల విద్య మాత్రం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని పేర్కొన్నారు. విద్యా వీక్షణం పేరిట కొత్తగా ప్రారంభమైన విద్యా విశే్లషణ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీఫ్ ఎడిటర్ ఎన్ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, ఎమ్మెల్సీ పి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థుల సమస్యలపై దృష్టిసారించడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ చుక్కారామయ్య చెప్పారు. విద్యారంగం విషయంలో ప్రభుత్వ తీరును సరిదిద్దేలా సద్విమర్శలు చేయాలని, ఇటీవల సామాజిక మాద్యమాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని దానిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి మంచి సూచనలు కూడా ఇవ్వాలని పి సుధాకర్‌రెడ్డి అన్నారు. పత్రిక మార్గదర్శిగా వ్యవహరిస్తుందని చీఫ్ ఎడిటర్ ఎన్ నారాయణ అన్నారు.