తెలంగాణ

ప్రైవేటు సెక్యూరిటీ రంగంపై ఏపీఎస్‌ఏ-బెటర్ ప్లేస్‌ల ఎంవోయూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది పనితనం, వారి జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ (ఎపిఎస్‌ఎ), బెటర్ ప్లేస్ అవగాహన ఒప్పందం (ఎంవోయు) చేసుకున్నాయి. శుక్రవారం బేగంపేటలోని ఒక హోటల్‌లో జరిగిన సదస్సుకు 250 మందికి పైగా సిఇవోలు, ఎండీలు, ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షలకు పైగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది కలిగి ఉన్న ‘ఎపిఎస్‌ఎ’, టెక్ ఫ్లాట్‌ఫాం, బ్లూ కాలర్ మేనేజ్‌మెంట్ కంపె, బెటర్ ప్లేస్‌తో పాటు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యురిటీ స్డడీస్‌లు సంయుక్తంగా ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ది బ్లూ కాలర్ ఎకోసిస్టమ్ ఇన్ ప్రైవేటు సెక్టార్’ పేరిట నిర్వహించిన సదస్సుకు మాజీ డీజీపి స్వరణ్‌జిత్ సేన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కనె్నగంటి రమేష్ బాబు, సిఇవో ప్రవీణ్ అగర్వాల్, సౌరబ్ టాండన్, లెఫ్ట్‌నెంట్ కల్నర్ కెఎస్ రావు తదితరులు హాజరయ్యారు.
ఉన్నత చదువులకు ఎస్తోనియా ముందుకు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి యూరోపియన్ దేశమైన ఎస్తోనియా వర్సిటీలు ఇప్పుడు సరికొత్త గమ్యస్థానంగా నిలిచాయని స్టడీ ఎస్తోనియా కార్యక్రమానికి అంబాసిడర్ పాయల్ రాజ్‌పాల్ తెలిపారు. విద్యార్థులు ఎస్తోనియాలో తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
భారత్‌లోని ఎస్తోనియా రాయభారి రెహౌ క్రువ్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థులకు వంద శాతం ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
మిసికాన్-2018
అపోలో హాస్పిటల్స్ అధ్వర్యంలో ‘మినిమల్లీ ఇన్‌వేసివ్ స్సైస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా - మిసికాన్-2018’ పేరిట జరుగుతున్న మూడు రోజుల వార్షిక సదస్సును అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, మిసికాన్ అధ్యక్షుడు డాక్టర్ రోహిదాస్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ దేశ్‌పాండ్, కార్యదర్శి అరవింద్ కులకర్ణి, నిర్వాహణ కార్యదర్శి డాక్టర్ అలోక్ రంజన్, సహ-నిర్వాహణ కార్యదర్శి డాక్టర్ రాహుల్ లథ్‌లు హాజరయ్యారు.