తెలంగాణ

జగన్‌ను కేసీఆర్ పరామర్శిస్తే తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. వైసీపీ నేతపై జరిగిన దాడి వ్యవహారంలోకి టీఆర్‌ఎస్‌ను లాగితే ఊరుకోబోమన్నారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై దాడి జరిగితే బాధ్యతాయుతంగా స్పందిస్తే దానిని కూడా రాజకీయం చేయడం తగదని తలసాని హితవు పలికారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను మంత్రి తలసాని ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మనషుల ప్రాణాలు పోయినా తాము మాత్రం రాజకీయం చేస్తామని టీడీపీ నేతలు భావిస్తే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. జగన్‌పై దాడి జరిగితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపి కవిత ఫోన్లో పరామర్శిస్తే అది తప్పెలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే అదో డ్రామా కంపెనీగా మారినట్టు ఆగుపిస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోరడం వల్లనే సీబీఐ దాడులు చేస్తుందనడం శోచనీయమన్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగి కక్ష సాధింపు అనడానికి సిగ్గుండాలని తలసాని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ మాత్రం మానవత్వం లేని మరమనిషి అని టీఆర్‌ఎస్ మండిపడింది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు రామచంద్రరావుతో మీడియాతో మాడ్లాడుతూ, ప్రతీ దానిని రాజకీయం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌పై దాడి పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని కూడా తప్పు పట్టడం దారుణమనది దుయ్యబట్టారు.