తెలంగాణ

చంద్రబాబూ.. నీ ఆటలు సాగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 27: మహాకూటమో, గూటమో తేల్చుకుందాం రా బిడ్డా చంద్రబాబు అంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సవాల్ విసిరారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని, ఓటుకు నోటు కేసులో ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్నారని అందుకే కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపారని ఆరోపించారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టడానికి ఓ ప్రయత్నం చేస్తున్నారని కానీ తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎవరు నమ్మే స్థితిలో లేరని అది ఆంధ్రపార్టీగా తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయంలోనే ముద్ర వేశారని ఎన్ని నాటకాలు ఆడినా నీ ఆటలు తెలంగాణలో సాగవు చంద్రబాబు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టేందుకు సైతం కాంగ్రెస్ నాయకులతో రూ.500 కోట్ల ఒప్పందం చేసుకున్నట్లుగా తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌తో జతకట్టారని కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చేదిలేదని అన్నారు. బాబు మాత్రం ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు. వందమంది బాబులు వచ్చిన తెలంగాణ ప్రజలు మాత్రం మళ్లీ బానిసలు కాదల్చుకోలేదని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర వలసవాదుల ఏజెంట్లుగా మారారని హోంమంత్రి ధ్వజమెత్తారు. వారు వేసే బొక్కలకు కుక్కలా కాంగ్రెస్ నాయకులు మారారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పదేపదే అడ్డుకున్న నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అని ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడిన్నప్పుడే తెలంగాణ కూడా వచ్చేదని కానీ చంద్రబాబు అడ్డుతగలడంతోనే ఆలస్యమైందని విమర్శించారు. ఇలాంటి నాయకుల వల్లే తెలంగాణ యువత, విద్యార్థులు అమరులయ్యారని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటూనే ఉండాలని మరోసారి కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే తగాదాల పార్టీ అని ఆ పార్టీ సంసృతి కుర్చీలను పడగొట్టేవారు చాలామంది ఉంటారని అలాంటి వారు దారితప్పి అధికారంలోకి వస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకుల మాదిరిగా ఉంటుందని అలాంటి వారితో తెలంగాణ ప్రజలు అప్రమతంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, ఎడ్మా కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండలో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో
మాట్లాడుతున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి