తెలంగాణ

కూటమికి అధికారం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, అక్టోబర్ 27: కొద్దిరోజుల్లో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జనగామ పట్టణంలోని 1,2,9,10,12,13 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక గుండ్లగడ్డ ఆటోస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం ధర్మకంచ, సంజయ్‌నగర్, మైనార్టీ కాలనీ అంబేద్కర్ నగర్, బుడిగజంగాల కాలనీల్లో సాగింది. సుంకరికుల జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సోమరాజు ఆధ్వర్యంలో 60మంది, ఎండీ నజ్మా ఆధ్వర్యంలో 50మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరగా మాజీ మంత్రి పొన్నాల వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మించి నాలుగేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కేసిఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కోరారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలకు అన్యాయం చేసిన కేసిఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే ప్రజలు అన్ని విధాల సుఖశాంతులో జీవించారని అన్నారు. అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. జనగామ పట్టణ ప్రజలు తనకు భారీ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ధర్మపూరి శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అన్వర్, అధికార ప్రతినిథి రంగరాజు ప్రవీణ్‌కుమార్, నాయకులు తోట సునిల్, ఎండీ మజార్, ఇస్మాయిల్, ఏదునూరి యాదగిరి, మారబోయిన పాండు, మంద వెంకటనర్సయ్య, రాజేష్, మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
చిత్రం..జనగామ ధర్మకంచలో ఎన్నికల ప్రచారం చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య