తెలంగాణ

నీటి వాటాకు కేసీఆరే శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 27: కృష్ణ, గోదావరి నీళ్లలో న్యాయమైన వాటా రావాలంటే తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఇంటిపార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని.. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ పీఎంపీ, ఆర్‌ఎంపీల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆశీర్వాద సభకు మంత్రి హరీష్‌రావు హాజరై మాట్లాడారు. తెలంగాణ స్వీయ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణను ఒకరు అమరావతి, ఢిల్లీ వద్ద తాకట్టు పెట్టే యత్నం చేస్తున్నారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరిట చంద్రబాబు, కన్ను కొట్టే సిద్ధాంతం పేరిట రాహుల్‌గాంధీ అపవిత్ర పొత్తులు పెట్టుకొని తెలంగాణను మరోసారి అన్యాయం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పరితపించే కేసీఆర్ సిద్ధాంతాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు, ఎరువులు, విత్తనాల కొరత తప్పదన్నారు. మళ్లీ ఆంధ్రా పెత్తనం కొనసాగుతుందన్నారు. వచ్చే ఐదేండ్లు చాలా కీలకమైనవని విభజన చట్టంలో భాగంగా కృష్ణ, గోదావరి జలాల్లో నీటివాట, ఉమ్మడి హైకోర్టు విభజన, ఉమ్మడి రాష్ట్ర ఆస్తి పంపకాలు జరగాల్సి ఉన్నాయన్నారు. తెలంగాణ ఇంటిపార్టీయైన టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్ అని.. టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం నుండి ఆర్‌ఎంపీ, పీఎంపీలతో అవినవభావ బంధం ఉందని, ప్రతి ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ, గుర్తింపు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ 2కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. కొన్ని దుష్టశక్తుల వల్లనే ట్రైనింగ్ ఆగిపోయిందన్నారు. ప్రతి పనిని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఆకలిచావులు అధికంగా ఉన్న సిద్దిపేటను ఏడాదిలోగా ఆకుపచ్చని సిద్దిపేటగా మారుస్తామన్నారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాల మాగాణీగా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, యాదగిరిరెడ్డిలు మాట్లాడుతూ మహాకూటమి డేంజర్ వైరస్ అన్నారు. ప్రాజెక్టులు ఆపేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆర్‌ఎంపీ,పీఎంపీల ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని మంత్రి హరీష్‌రావుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆర్‌ఎంపీల రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న, ప్రధాన కార్యదర్శి బాలరాజు, జిల్లా అధ్యక్షుడు వైకుంఠం, డాక్టర్ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..సిద్దిపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు