తెలంగాణ

టెక్నాలజీదే కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: సాంకేతికతకు మంచి ఉద్ధేశ్యాలు తోడ్పడితే అద్భుతాలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. విట్ -ఏపీ అమరావతి క్యాంపస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రిన్సిపాల్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. విద్యావ్యవస్థకు సాంకేతిక అనుసంథానం ద్వారా పిల్లల థింకింగ్ ఎబిలిటీ పెరిగేలా కరిక్యులం రూపొందించడం అనే అంశంపై సెమినార్ జరగడం అభినందనీయమని అన్నారు. ఈకార్యక్రమంలో విఎస్‌బీ డీన్ డాక్టర్ ఎస్ జయవేలు, విశ్వాస్ ఆనంద్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ గణేష్, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ నోరానా , పర్యావరణ వేత్త నవీన్ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.