తెలంగాణ

జగన్‌పై దాడి చేసింది ఎవరో తేల్చాల్సింది మీరు కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసింది ఎవరో తేల్చాల్సిన బాధ్యత మీకు లేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్ధేశించి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. జగన్‌పై జరిగిన దాడిని చిన్న విషయంగా చూపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌కు ఎవరి ప్రోద్బలమో ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దాడికి ఉసిగొల్పిందెవరో తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని మేకపాటి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ మరిచిపోయారని చెబుతున్న చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హమీల సంగతేమిటో చెప్పాలని మేకపాటి డిమాండ్ చేశారు.
శివాజీపై విచారణ: ఇక్బాల్ డిమాండ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రిటైర్డ్ ఐజీ మహ్మద్ ఇక్బాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదని అన్నారు. దాడి చేసిన ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డీజీపి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిందితుడు పది వేల కాల్స్ ఎవరికి చేశాడో తేల్చాలన్నారు. ఇంట్లో డబ్బులు ఇవ్వలేని వ్యక్తి మటన్ బిర్యానీ విందు ఇస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస రావు గురించి లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తి అభిమాని ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తా?, కిరాయి హంతకుడా?, ఎవరికైనా అమ్ముడుపోయాడా? ప్లెక్సీ ఎక్కడిదీ? అనేవి వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. నిందితుడు శ్రీనివాస్ రావు కుటుంబం కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అన్నారు. పని చేసే రెస్టారెంట్ యజమాని కూడా టీడీపీ క్రియాశీలక కార్యకర్తేనని ఆయన తెలిపారు. పెయిడ్ ఆర్టిస్టు శివాజీని పిలిపించి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జీవితం సెటిలయ్యే వ్యక్తి దొరికాడని చెప్పినందున, ఆ వ్యక్తి ఎవరో కూడా తేలాలని మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యా యత్నం జరిగిందని నిమిషాల్లో మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలిస్తే, చంద్రబాబు మాత్రం 4.30 గంటలకు విలేఖరులతో మాట్లాడుతూ తమకు ఇంకా నివేదిక రాలేదని చెప్పడం బాధ్యతారాహిత్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.