తెలంగాణ

యువతకు స్ఫూర్తిదాత మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలు లభించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం బీజేవైఎం యువ భేరీ ముగింపు బహిరంగ సభలో డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ ముందస్తు ఎన్నికల్లో పార్టీ జెండా ఎగుర వేస్తామని ధీమాగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ యువతకు స్ఫూర్తిదాత అని అన్నారు. అధికారంలోకి రాగానే ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించలేదని, కేసీఆర్ కుటుంబంలో నలుగురికీ ఉద్యోగాలు లభించాయని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి రాగానే యువతకు పెద్ద పీట వేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించేందుకు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.