తెలంగాణ

కొనసాగుతున్న పంటల కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పంటల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. పెసళ్ల ధరలు మార్కెట్‌లో తక్కువగా ఉండటంతో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటాల్‌కు నిర్ణయించిన కనీస మద్దతు ధర అయిన 6975 రూపాయలకు రైతులకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 85.30 కోట్ల రూపాయల విలువైన 2291 టన్నుల పెసళ్లను కొనుగోలు చేశారు. భారత ప్రభుత్వం 11,500 టన్నుల పెసళ్లను కొనుగోలు చేయాలని అనుమతించింది. ఈ మొత్తాన్ని పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మక్కజొన్నకు ఎంఎస్‌పీ 1700 రూపాయలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు 189 కోట్ల రూపాయల విలువైన 1,11,614 టన్నుల మక్కలను కొన్నారు. పత్తికి అత్యధికంగా క్వింటాల్‌కు 5700 రూపాయలు నడుస్తోంది. మార్కెట్లో పత్తి ఎక్కువ ధరకే అమ్మకం అవుతోంది. ప్రైవేట్ వ్యాపారులు ఇప్పటికే 6.64 లక్షల క్వింటాళ్ల పత్తిని కొన్నారు. దాంతో పత్తి విషయంలో ప్రభుత్వం ఎక్కువ జోక్యం చేసుకోవాల్సిన అవసరం రావడం లేదు. సోయాబీన్‌కు కూడా మార్కెట్లో మంచి ధరనే లభిస్తోంది. సోయాబీన్ కొనుగోలుకు ప్రభుత్వ పరంగా 26 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.