తెలంగాణ

భద్రతకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: గతంలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీస్ బలగాల మోహరింపుతో పాటు వేలాదిమంది కేంద్ర, రాష్ట్ర బలగాలు కవాతు నిర్వహించాయ. దీంతో పాత బస్తీలో నిషేధ ఉత్తర్వులు (కర్ఫ్యూ వాతావరణం ) అమలు అవుతున్నాయన్న సంఘటనలను స్థానికులు గుర్తు చేసుకున్నారు. పాత నగరంలో ఉన్న సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలు ఫ్లాగ్‌మార్చు ప్రదర్శనలు చేపట్టారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు బందోబస్తుకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో వ్యూహాత్మకంగా ప్రదర్శన నిర్వహణలతో ఓటర్లలో మనోధైర్యం పెంపొందించడానికి సకల చర్యలకు సిద్ధమంటున్నాయి. ఎన్నికల కమిషనర్ సూచిస్తున్న కోడ్‌ను అమలు చేయడానికి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. హింసాత్మక సంఘటనలకు అవకాశం ఉన్న ప్రాంతాలకు క్షణాల్లో బలగాలు చేరుకోవడానికి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. గొడవలు, అల్లర్లు జరిగే ప్రాంతల్లో సీసీటీవీ కెమెరాలను ఆగమేఘాలపై ఏర్పాటు చేస్తున్నారు. వీటి పరిశీలన కోసం సైతం బలగాలకు శిక్షణ కూడా పూర్తి చేశారు.
రాబోవు ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక పండుగలా చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పిలుపు ఇచ్చారు. ఆదివారం పాత బస్తీలో కవాతు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ గుర్రం స్వారీతో ప్రారంభించారు. ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌లో పోలీస్ బలగాలతో భారీ కవాతు కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రజల్లో ధైర్యం వస్తుందని అన్నారు. స్వేచ్ఛగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనడానికి భరోసా ఇవ్వడానికే బలగాలతో కవాతు అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెంచడానికి, ఓటర్లలో భయబ్రాంతుల్ని తొలగించడానికి బలగాల మోహరింపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికలకు అన్ని చర్యలు చేపడుతున్నామని అయితే ఓటర్లు కూడా భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు. పాత బస్తీలో రాబోవు ఎన్నికల్లో 100 శాతం ఓటర్లు ఓటువేయాలన్నారు. పండుగల్లో బస్తీలు ఏ విధంగా ఒక్కటి అవుతాయో అలా బస్తీ వాసులు అంతా మూకుమ్మడిగా ఓటింగ్‌కు తరలిరావాలన్నారు.
చార్‌మీనార్ నుంచి భవానీనగర్, ఎత్తేబార్ చౌక్, మీర్‌చౌక్, దరూల్‌షిషా మీదుగా దాదాపు 6 కిలోమీటర్లు దూరం బలగాలతో కవాతు చేపట్టారు. ఈ కవాతులో అశ్విక దళాలతో పాటు సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఎఎఫ్,సీపీల్, సీఎఆర్‌ఎఫ్, ఎస్‌ఎఆర్ బలగాలు కవాతు ప్రదర్శనలో పాల్గొన్నాయి. సీనియర్ పోలీస్ అధికారులు డిఎస్ చౌహాన్, క్రైమ్ విభాగం అడిషనల్ ఎస్‌పీ శిఖాగోయల్, సౌత్‌జోన్ డిసీపీ అంబర్ కిషోర్‌ఝా, ట్రాఫిక్ డీసీపీ బాబురావు, అడిషనల్ డిసీపీ చైతన్యకుమార్, సౌత్ అడిషనల్ రఫీక్, ఎసీపీ అంజయ్య, శివరామశర్మ, ఆనంద్, రషీద్, ఎస్‌బి ఎసీపీ మోహన్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.... ఎన్నికల సందర్భంగా చార్‌మీనార్ వద్ద మోహరించిన కేంద్ర, రాష్ట్రాల బలగాలు