తెలంగాణ

కుంపటిలో... వేరుకుంపటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 28: తెలంగాణలో ఎట్టి పరిస్థితిలోనైన అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై ఆపార్టీ ఆశావాహులు నీళ్లు చల్లబోతున్నారా? వీళ్లంతా కలిసి కుంపటిలో, వేరు కుంపటి పెట్టాబోతున్నారా? మహాకూటమి తరహా మరో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాబోయో ఎన్నికల్లో గెలుపొంది తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ధృడ సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పిడుగు లాంటి వార్త ఇది. గెలుపును ఖరారు చేసుకునేందుకు ఆ పార్టీ అంది వచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుని ముందుకు పోతుంది. అందులో భాగంగానే తెలంగాణలోని ఇతర ప్రతి పక్ష పార్టీలతో కలసి అది మహాకూటమి ఏర్పాటుకు పూనుక్పున్నది.
ఈ క్రమంలో ఆ పార్టీ తన ఆగర్భ శత్రువైన తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తుకు సై అంది. కూటిమి కట్టడం వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా చూడాలని తద్వారా అధికారంలోకి రావాలని ఉబలాటపడుతుంది. కాని కూటమి కట్టడమే దాని కొంపను ముంచేటట్లు కనబడుతుంది.