తెలంగాణ

కూటమి సీట్లపై కిరికిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 28: మహాకూటమి పార్టీల్లో నెలకొన్న సీట్ల కేటాయింపు కిరికిరితో కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ నాయకత్వాలు సతమతమవుతున్నాయి. సీట్ల కేటాయింపులు, సర్ధుబాట్ల వ్యవహారం చూడాల్సిన కూటమి పెద్దన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడు నుండి నాలుగు సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో కాంగ్రెస్ ఆశావహుల్లో నైరాశ్యం మొదలైంది. మిర్యాలగూడ నుండి టీఆర్‌ఎస్ సీటు దక్కక ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌లో చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డికి టీజెఎస్ రూపంలో కాంగ్రెస్‌లో కూడా టికెట్ దక్కడం అసాధ్యంగా కనిపిస్తుంది. టీజెఎస్ అధినేత కోదండరామ్ మిర్యాలగూడ సీటును పార్టీ నేత గవ్వా విద్యాధర్‌రెడ్డి కోసం కోరుతున్నారు. అయితే ఈ సీటులో తన కుమారుడికి టికెట్ కోరిన జానారెడ్డి ఒక కుటుంబానికి రెండు టికెట్లు సాగర్, మిర్యాలగూడలలో ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకంగా ఉండటంతో మిర్యాలగూడ సీటును టీజెఎస్‌కు వదులాలని జానారెడ్డి భావిస్తున్నారు. అయితే జానారెడ్డి తన రాజకీయ పర్యవేక్షణలో ఉన్న మిర్యాలగూడలో టీజెఎస్ నుండి విద్యాధర్‌రెడ్డి కంటే గతంలో తెలంగాణ ఫిలీం చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పనిచేసిన మేరెడ్డి విజయేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చే విషయమై కోదండరామ్ పరిశీలన చేయాలని జానారెడ్డి సూచించారని తెలుస్తుంది.
జానారెడ్డి వియ్యంకుడి సోదరుడైన విజయేందర్‌రెడ్డికి టీజేఎస్ టికెట్ కోసం జానా ప్రయత్నించినప్పటికి కోదండరాం సహా ఆ పార్టీ నాయకత్వం జానా ప్రతిపాదన పట్ల విముఖంగా ఉన్నట్లుగా టీజెఎస్ వర్గాల కథనం.