తెలంగాణ

కేసీఆర్‌తోనే రామరాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: టీఆర్‌ఎస్ చేపట్టిన ప్రతి సంక్షేమం, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తానంటోందని.. ప్రతి దానిని వద్దు... రద్దు అంటున్న కాంగ్రెస్ పార్టీని.. ఇక్కడి నుండి రద్దు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మున్నూరుకాపు సంఘ భవనంలో నియోజక వర్గంలోని వివిధ గ్రామాల సంఘం ప్రతినిధులు మంత్రి హరీష్‌రావుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి, తీర్మాన పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు రద్దు చేస్తామని, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్, రైతు బంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ రద్దు చేస్తామని అంటున్నారని, వీటిని ప్రజలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతు సీఎం కావటం వల్లనే రైతురాజ్యం ఏర్పడిందని, కొద్దిరోజుల్లో తెలంగాణలో మరోసారి రామరాజ్యం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో దొంగరాత్రి కరెంటు వుండేదని, ఇప్పుడు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే, ప్రపంచంలో రైతుకు పెట్టుబడి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రైతు పెట్టుబడులు ఎకరానికి 10వేల రూపాయలు అందించబోతున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, వచ్చే ఏడాది నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటితో చెరువులు, కుంటలు నింపి సాగుకు అందించనున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఓట్ల కోసమని చెప్పలేదని, ప్రజలకు రైతులకు ఏంతో అవసరమని చెప్పినట్లు తెలిపారు. కాంగ్రెస్ మళ్లీ వస్తే అర్ధరాత్రి కరెంట్, ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏడాదికి 6వేల కోట్లతో రైతుబంధు పథకం, వెయ్యి కోట్లతో రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెయ్యి కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రుణమాఫీ పథకం కింద 42 లక్షల మందికి రైతులకు అందించనున్నట్లు తెలిపారు. రెండు ఎకరాల ఉన్న ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ, పెట్టుబడి సాయం మరో లక్ష రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఐదేళ్లు మీకు అందుబాటులో ఉండి, మీ కష్ట,సుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్లు తెలిపారు. కన్నుకొట్టే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, రెండు కళ్ల సిద్దాంతమనే చంద్రబాబులు అ పవిత్ర పొత్తులతో మహాకూటమి పేరిట తెలంగాణను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు.

చిత్రం..సిద్దిపేట మున్నూరుకాపుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు