తెలంగాణ

అప్పుచేసి పప్పు కూడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆదాయంతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నిజంగానే బంగారు తెలంగాణ చేస్తాడని అనుకున్నాని, కాని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేసి, ప్రజాధనం వృధా చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ చాట్ల లక్ష్మీరాజేశ్వర్, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్‌తో పాటు దాదాపు 1500మంది టీఆర్‌ఎస్ పార్టీని వీటి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ చేరికల సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలోచేరిన వారందరికి షబ్బీర్‌అలీ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న తరువాత, ఏర్పాటైన సభను ఉద్ధెశించి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేస్తాడని అనుకుంటే రాష్ట్రంలోని ఆదాయం అంతా అప్పనంగా ఖర్చు చేసి, చివరకు తెలంగాణ రాష్ట్రాని 2లక్షల కోట్ల అప్పుల ఊబీలోకి కేసీఆర్ నెట్టేశారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణ రాష్ట్రం 11వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే, నాల్గుఏళ్ల టీఆర్‌ఎస్ పాలనలో 2లక్షల కోట్ల అప్పు ఉందంటే, ప్రజలు ఈ విషయాన్ని పరిశీలించాలని అన్నారు.

చిత్రం..కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రసంగిస్తున్న షబ్బీర్‌అలీ