తెలంగాణ

సెటిలర్స్‌ను హర్ట్ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: సెటిలర్స్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ హర్ట్ చేయలేదని, మహాకూటమి నేతలే వారిలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణలో సీమాంద్ర ప్రజలకు భవిష్యత్‌లో కూడా అండగా నిలుస్తామని భరోసా కల్పించడానికే మంత్రి కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా హైదరాబాదీయులే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అడ్డుపడనని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇప్పించాలని భాను ప్రసాద్ డిమాండ్ చేసారు. చంద్రబాబు వద్ద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడే మొకరిల్లుతున్నారంటే భవిష్యత్‌లో ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న స్థానాలను గెలుచుకోవడమే గొప్పా అని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఓటమి అంచుల్లో ఉన్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి, తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నెవేర్చలేదన్నారు. తెలంగాణకు ఎదో ఉద్దరించినట్టు అమిత్ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుడప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చినప్పుడే ఇక్కడ బీజేపీ ఉందనే విషయం తెలియడం లేదన్నారు. ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఐదు స్థానాలనే గెలుచుకునే పరిస్థితి లేదుకానీ, అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటోందని భాను ప్రసాద్ విమర్శించారు.