తెలంగాణ

ఇంతకీ విచారణలో తేలిందేమిటి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, అక్టోబర్ 29: ధర్మపురిలో ఆంధ్రా పోలీసులు సంచరించారని ప్రచారం చేసిన సంఘటనకు రాజకీయ రంగు పులిమి, మసిపూసి మారేడుకాయ చేసి, సంచలనంగా మార్చిన సంఘటనలో పోలీసు అధికారులు జరిపిన విచారణలో తేలిందేమిటనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పక్షాన ధర్మపురిలో డబ్బులు పంచుతూ తమ నాయకులకు పట్టు బడినారని సాక్షాత్తూ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించడం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం రాష్టవ్య్రాప్త దృష్టిని ఆకర్షించేలా చేసింది. వాస్తవంగా నారాయణరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, మధు అనే వ్యక్తులు ధర్మపురికి విచ్చేసి, టీడీపీ సీనియర్ నేత సహకారంతో బసకు గదులు తీసుకుని, మూడు రోజులుగా పార్టీలు, పోటీ చేయనున్న అభ్యర్థులు, గెలుపు అవకాశాలు తదితర అంశాలపై పట్టణ వాసులతో ఆరా తీస్తూ, సర్వేలు నిర్వహించారు. వారికి టీడీపీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ద్విచక్ర వాహనాలను సమకూర్చారు. గోదావరి సమీపాన సర్వేలో వారు నిమగ్నమైన సమయాన తెరాసకు చెందిన నాయకుడు, వారి గురించి అడిగి, సరైన సమాధానం రాని స్థితిలో, సమాచారం అందుకున్న మరి కొందరు తెరాస పదాధికారులు అక్కడకు చేరి, అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని ఎస్‌ఐకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. జగిత్యాలలో ఉన్న ఎస్‌ఐ ఆదేశానుసారం బ్లూకోల్ట్స్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, అనుమానితులను స్టేషన్‌కు తీసుకెళ్ళారు. అక్కడా వారేమీ సమాధానం చెప్పక పోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.