తెలంగాణ

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగోడ్, అక్టోబర్ 29: టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎంను చేసేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి, అబద్దాలు చెబుతున్నాడని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ధ్వజమెత్తారు. మోసకారి కేసీఆర్ మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హమీలను నెరవేర్చని కేసీఆర్‌కు ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెలంగాణలో లేదన్నారు. అబద్దాల కోరు కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే సమస్యలు తొలుగుతాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే కేసీఆర్ వమ్ము చేసాడని మండిపడ్డారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క సారి కూడా డీఎస్సీ నిర్వహించలేకపోయారని విమర్శించారు.
ఉన్నత చదువులు చదువుకున్న వారిని ఆశల పల్లకిలో ఊరేగే విధంగా అదిగో డీఎస్సీ, ఇదిగో డీఎస్సీ అంటూ ప్రకటనలు చేయడంతో వేల రూపాలు ఖర్చు చేసుకుని శిక్షణలు పొందారని, చివరకు నిరుద్యోగుల ఆశలు అడియాసలు చేసారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ గద్దెనెక్కి హామీలను విస్మరించిన కేసీఆర్‌కు నిరుద్యోగులు బుద్ది చెప్పటం ఖాయమని దామోదర్ జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా తలెత్తుకుంటుందన్నారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఓకేసారి రూ.13 వేల కోట్లు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడమే కాకుండా రైతులకు విద్యుత్ బకాయిలు రద్దు చేసి ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసారు. వృద్దాప్య, వితంతు పింఛన్లను అవసరమైన వారికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీ రుణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

చిత్రం..మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మర్పల్లి గ్రామస్థులు