తెలంగాణ

విత్తనోత్పత్తిపై నేడు వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: రైతులకు నాణ్యమైన విత్తనం అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు ఆర్గానిక్ సర్ట్ఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, విత్తనోత్పత్తి అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ, ఇండో జర్మన్ విత్తన రంగం ప్రాజెక్టు సంయుక్తంగా రెండు రోజుల వర్క్‌షాప్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కత్రియా హోటల్‌లో మంగళవారం ప్రారంభమయ్యే ఈ వర్క్‌షాప్ బుధవారం మగుస్తుందన్నారు. తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన విత్తనోత్పత్తి సంస్థల ప్రతినిధులు, శాస్తవ్రేత్తలు పాల్గొంటారన్నారు. దాదాపు 130 మంది వరకు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నట్టు తెలిపారు. కోత, నూర్పిళ్లు, శుద్ధిచేయడం, ప్యా కింగ్ వరకు అనేక జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో భారత వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. పట్నాయక్, కాలిఫోర్నియా యూనివర్సిటీ విత్తన శాస్తవ్రేత్త కెంట్ బ్రాడ్‌పోర్ట్, జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ కౌన్సిలర్ మైకెల్ కెస్లర్, ఇండోజర్మన్ ప్రాజెక్ట్ టీం లీడర్ ఎకార్ట్ షోడర్, తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తదితరులు పాల్గొంటున్నారని కేశవులు వివరించారు.