తెలంగాణ

పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులుగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు రూపొందించిన ప్రణాళికను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాన్య ప్రజలు ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేస్తే వెంటనే విచారణ జరిపించాలని, విచారణ పూర్తి కాగానే ఫిర్యాదుదారుడికి సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక జాగ్రత్తగా చేయాలని, ఒకటికి రెండు సార్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల ఎంపిక ఎలా ఉందో జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని, మారుమూల ప్రాంతాల్లో ఎంపిక చేసిన కేంద్రాలను హఠాత్తుగా తనిఖీ చేయాలని సూచించారు. కనీస వౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా దివ్యాంగులు ఎంత మంది ఉన్నారో పరిశీలించి, వారంతా ఓటు హక్కు వినియోగించేందుకు సహకరించాలని సూచించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను మొదట క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయికి పంపిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఇవి సవ్యంగా పనిచేస్తున్నాయో లేదో ఒకటికి రెండు సార్లు పరీక్షించాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ధనప్రవాహం, మద్యం పంపిణీ కాకుండా చూడాలని కోరారు. ఇప్పటికే తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఆ యా ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో అమ్మకాలు ఎలా సాగుతున్నాయో, గత ఆరు నెలల నుండి అమ్మకాలను పరిశీలించి, తాజా అమ్మకాలతో పోల్చాలన్నారు. అమ్మకాలు ఎక్కడన్నా సాధారణం కంటే అత్యధికంగా ఉంటే దానిపై ఎక్సైజ్ అధికారుల చేత విచారణ చేయించాలన్నారు. డబ్బు పంపిణీ జరగకుండా, రాజకీయ నాయకులు భారీ మొత్తంలో డబ్బు తరలించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అలాగే చిన్న చిన్న రోడ్ల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటి వస్తువులను రాష్ట్రంలోకి రాకుండా చూడాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రజత్‌కుమార్ ఆదేశించారు. జిల్లాల్లో ఇప్పటి వరకు అధికార టీఆర్‌ఎస్ మినహా మిగతా పార్టీల వాళ్లెవరూ పెద్దగా ప్రచారం చేయడం లేదని వివిధ జిల్లాల కలెక్టర్లు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు.