తెలంగాణ

మహాకూటమి గెలుపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: రాష్ట్ర ప్రజలను కంటి వెలుగులో పరీక్షలు చేయించుకోమని అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చెప్పి తాను మాత్రం ఢిల్లీలో కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆసుపత్రి అని కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళారని మధుయాష్కీ గౌడ్ సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఓటమి భయంతో ఆంధ్ర ప్రజలకు అండగా ఉంటామని అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు అభయం ఇచ్చారని ఆయన అన్నారు. నిన్న, మొన్నటి వరకూ సీమాంధ్రులను కేసీఆర్ తిట్టిన తిట్లు కేటీఆర్‌కు గుర్తు లేవా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు సీమాంధ్రలంటే నచ్చదని ఆయన విమర్శించారు. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతున్నదని ఆయన తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఎంతో కృషి ఉందన్నారు. అమరావతికి వంద కోట్లు బిక్షమిస్తున్నట్లు కేటీఆర్ మాట్లాడడం దారుణమని ఆయన విమర్శించారు.