తెలంగాణ

టీడీపీ పోటీ చేసే స్థానాలు ఇవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: మహాకూటమి సర్దుబాటు ఎవరూ ఊహించని రీతిలో కొలిక్కి రావడంతో నవంబర్ 1న తొలి జాబితాను ప్రకటించనున్నట్టు కూటమి నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలపై నేతలు ఇప్పటికే అనధికారిక జాబితాను విడుదల చేశారు. శేరిలింగంపల్లి నుండి బండారు మొహన్ ముదిరాజ్, కూకట్‌పల్లి నుండి పెద్దిరెడ్డి, ఉప్పల్ నుండి వీరేంద్రగౌడ్, కుత్బుల్లాపూర్ నుండి అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్, రాజేంద్రనగర్ నుండి గణేష్ గుప్త, లేదా సామా భూపాల్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నుండి అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి, ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుండి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుండి మచ్చ నాగేశ్వరరావు, మక్తల్ నుండి కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవరకద్ర నుండి సీతా దయాకర్‌రెడ్డి, జడ్చర్ల నుండి ఎర్రశేఖర్ , వనపర్తి నుండి రావుల చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుండి మండల వెంకటేశ్వరరావు, కోరుట్ల నుండి ఎల్ రమణ పేర్లు ఖరారైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.