తెలంగాణ

మహిళల రక్షణకు కఠిన చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: మహిళల రక్షణకు కఠిన చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకుని వ్యవహరించాలని జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు లలిత కుమార మంగళం పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ గవర్నెన్స్, రాంబావు మల్గీ ప్రబోధిని సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పడం కంటే వారిని జవాబుదారీగా ఉండడం నేర్పించాల9ని సూచించారు. దేశం అంతా మహిళలపై వివక్ష ఒకే విధంగా ఉందని, ఎంత చదువుకున్నా గృహ హింస, కార్యాలయాల్లో లైంగిక వేధింపులు ఒకేలా ఉన్నాయని, చివరికి వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలపై కూడా హింస ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తాము మహిళలపై సక్రమంగా వ్యవహరించి, ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నపుడే ఎదుగుతున్న తరం దానిని ఆచరిస్తుందే తప్ప మాటలతో వారిని ఆచరించమని చెబితే నిర్లక్ష్యం చేస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం కేవలం మహిళలే కృషి చేస్తే సరిపోదని, పురుషుల సహకారం కూడా ఉండాలని, కుటుంబం విలువలతో ఎదగాలంటే ఇరువురి తోడ్పాటు అనివార్యమని అన్నారు. స్ర్తిలను గౌరవంగా సమాజం చూసినపుడే దేశం పరిఢవిల్లుతుందని అన్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ మీనా హరిహరన్, ముఖ్యవక్తగా పి మురళీమనోహర్ హాజరయ్యారు. డాక్టర్ జయంతి కులకర్ణి, డాక్టర్ కే బాలరాజు మాట్లాడారు. విలువల పునరుత్పత్తి - విశ్వాసాన్ని పెంపొందించడం అంశంపై ఎన్ అశ్విని, ప్రొఫెసర్ టీ మృణాళిని మాట్లాడారు. లైంగిక వేధింపులకు పాల్పడితే ఎదురయ్యే సమస్యలపై సాగర్ నెవాసె, ఎం విజయాదేవి , టెక్నాలజీ వినియోగంతో ఎదురవుతున్న సమస్యలు, ప్రయోజనాలపై డాక్టర్ ఏ శైలజ, ఎన్‌ఎండీసీ డైరెక్టర్ ఉషాసింగ్ మాట్లాడారు. ముగింపు కార్యక్రమానికి ఇన్‌కం టాక్స్ ట్రిబ్యునల్ అపెలెట్ ట్రిబ్యునల్ జుడిషియల్ సభ్యురాలు పి మాధవి దేవి, సామాజిక కార్యకర్త ఎక్కా చంద్రశేఖర్ హాజరుకాగా, వర్కుషాప్ కన్వీనర్‌గా డాక్టర్ కే బాలరాజు వ్యవహరించారు.
చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న కుమార మంగళం