తెలంగాణ

4న బీసీల గర్జన సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఈ నెల 4న (ఆదివారం) పెద్ద ఎత్తున బీసీల బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు 112 బీసీ కుల సంఘాలు మద్దతునిచ్చాయి. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని కృష్ణయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. 4న జరిగే బహిరంగ సభలో ప్రవేశపెట్టే డిమాండ్లపై కమిటీ చర్చింది. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్ట సభలలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతం వరకు పెంచాలని, ఈ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధత కల్పించాలని, బీసీలకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలన్నారు.