తెలంగాణ

పిచ్చి వేషాలు వేస్తే నాలుక చీరేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: రాజకీయ లబ్ధి కోసం పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే నాలుక చీరేస్తామని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొల్గూరులో మాజీ ఎంపీపీ మల్లం రాజు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా ఏర్పాటుచేసిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ దెబ్బతో అమరావతిలో పడిన చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని, తెలంగాణపై మరోసారి పెత్తనం చెలాయించాలని చూస్తున్న ఆయన ఆటలు సాగనిచ్చేదిలేదని పేర్కొన్నారు. చంద్రబాబు చేతిలో ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ కీలుబొమ్మగా మారగా, ప్రజాదరణను చూసి రాహుల్ సైతం టీఆర్‌ఎస్‌లో చేరే పరిస్థితి రావచ్చని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అధికారం కోసం అపవిత్ర పొత్తులతో సిద్దాంతాలు, నియమాలు పక్కన బెట్టి మహాకూటమి ఏర్పాటు చేసుకోగా, ఆ కూటమికి ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుండగా, ప్రాజెక్టులను అడ్డుకుని ఏపీకి ప్రయోజనం చేయడం కోసం కుట్రలు, కుతంత్రాలకు తెరలేపినట్లు విమర్శించారు. టీఆర్‌ఎస్ త్యాగాల పార్టీ కాగా, వెన్నుపోట్ల పార్టీగా టీడీపీని ప్రజలు ఎప్పుడో పాతాలం లోకి నెట్టివేసినట్లు తెలిపారు. ముగిసిన అద్యాయం, ఆరిపోయే దీపం టీడీపీ కాగా, ఆ పార్టీతో ఇక్కడి నేతలకు పనేమిటని నిలదీశారు. 46వేల చెరువులు నింపి బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా టీఆర్‌ఎస్ ముందుకెల్తుండగా, దగుల్బాజీలు చీఫ్‌ట్రిక్స్ వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు చెందిన చవటలు దద్దమ్మలకు ప్రజలే గుణపాటం చెబుతారని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, కళ్యాణలక్ష్మితో మేనమామలాగా, కేసీఆర్ కిట్‌తో మనువడికి తాతలాగా, వివిద రకాల పెన్షన్‌లతో ఆపద్బాందవుడిలా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్‌ను ఢీకొనే సత్తా ఏ పార్టీకి లేదని చెప్పారు. కొల్గూరు ప్రజల మూకుమ్మడి నిర్ణయంతో తాను గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానని హామీ ఇవ్వగా, కాంగ్రెస్ డబ్బులు, క్వార్టర్ సీసలకు అమ్ముడు పోవద్దని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్‌లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మాజీ జెడ్‌పీ చైర్మెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎంపీపీ రఘుపతిరావు, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కొల్గూరులో ప్రసంగిస్తున్న మంత్రి హరీష్‌రావు