తెలంగాణ

నీళ్లు, నిధులు, నియామకాలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,నవంబర్ 5: నర్సాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కేసీఆర్ 12వందల మంది ఉద్యమకారుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణను స్వలాభం కోసం ఉపయోగించుకొని లబ్ధి పొందాడని అన్నారు. ఇంటికో ఉద్యోగం దేవుడెరుగ.. కేసీఆర్ ఇంట్లో వారందరికి ఉద్యోగాలు వచ్చింది వాస్తవం కాదా! అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. ఏ వర్గానికి న్యాయం చేయలేని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ సరిగా కాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రాలేదు, మైనార్టిలకు ఇస్తానన్న రిజర్వేషన్లు ఏమయ్యాయని, విద్యార్థలకు ఫీజురియింబర్స్ మెంటు ఎక్కడ, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌లు ఎక్కడ అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్‌బెడ్ రూంలు వచ్చాయా అని అని అన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని గద్దేనెక్కి ఫాం హౌజ్‌కు పరిమితమయ్యాడని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఒక్కనాడు అసెంబ్లీలో మాట్లాడలేదు కాని కేసీఆర్‌కు మందు ఎత్తడానికి మాత్రం పని చేశాడని ఎద్దేవ చేశారు. కేటీఆర్ అనే ఒక సన్యాసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీని ముసలినక్క, చంద్రబాబు నాయుడును గుంటనక్క అంటున్నాడు. పందికి పరిశుభ్రత నేర్పడం, గాడిదికి సంగీతం నేర్పడం ఎంత కష్టమో కేటీఆర్‌కు సంస్కరం నేర్పడం అంత కష్టమని ఎద్ధేవ చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో పండుకొని మందు తాగడం తప్ప తెలంగాణకు ఏం చేయలేదని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి మాట్లాడుతూ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. 15సంవత్సరాల కాలంలో నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధే ద్యేయంగా పని చేశానని స్పష్టం చేశారు. ప్రజలు తనకు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, జడ్పీటీసీ సభ్యులు జయశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..అంబేద్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి