తెలంగాణ

కూటమి ఏర్పాటుతో టీఆర్‌ఎస్ బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 5: కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఆధ్వర్యంలో ప్రజల ముందుకు వస్తున్నది మహాకూటమి కాదని.. అది ప్రజా కూటమి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా కూటమి ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌కు ముచ్చెముటలు పడుతున్నాయని అన్నారు. తమ కూటమి ఏర్పాటు అయిన తర్వాతనే తమ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండడంతో సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. శాసనసభను రద్దుచేసే ముందు ఉన్న ఉత్సాహం రోజురోజుకూ పడిపొతోందని అన్నారు. ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటించిన అపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రజల ముందు అభాసుపాలువుతున్నాడని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా టీఆర్‌ఎస్ అభ్యర్ధులను ప్రజలు నిలదీస్తుండడంతో కేసీఆర్ జిల్లాల్లో బహిరంగ సభలకు కూడా వెళ్లేందుకు కూడా జంకుతున్నాడని ఆయన అన్నారు. తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ముందస్తు ఎన్నికలు తీసుకవచ్చాడని అన్నారు. ఈ క్రమంలో ఆయన అల్లుడు హరీష్‌రావును రోజురోజుకూ దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. వాస్తవాలు చెప్పుకోవల్సి వస్తే హరీష్‌రావులేనిదే టీఆర్‌ఎస్ లేదన్నారు. అయితే సీఎం కేసీఆర్‌కు పదవీ అకాంక్ష పెరిగిపోయి స్వార్ధం కోసం తన కొడుకుకు, కూతరుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అల్లుడైన హరీష్‌రావును దూరం చేస్తున్నాడని అన్నారు. దీంతో హరీష్‌రావు ప్రతిరోజూ ఆత్మసంఘర్షన ఎదుర్కొంటున్నాడని అన్నారు. అయితే హరీష్‌రావు సమయం చూసి దెబ్బ కొడితే మాత్రం కేసీఆర్ జీరో అవ్వడం ఖాయం అని అన్నారు. హరీష్‌రావులో రాజకీయ లక్షణాలు మెండుగా ఉన్నాయని అన్నారు. రేపటి ఎన్నికల ఫలితాలలో టీఆర్‌ఎస్‌కు బోటాబోటీ ఫలితాలు వచ్చినట్లైతే తనకున్న మద్దతు ధారులతో భయటకు రావడం ఖాయం అని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అవి మరింత బహర్గతం అవుతాయని అన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపులు సహజం అని, గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టీయే కాదని అన్నారు. తాము మహాకూటమి పొత్తులో భాగంగా చివరికు 21 స్థానాలు కొరితే 14 స్ధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వారు చెప్పుకుంటునట్లు ఉన్న మరో రెండు, మూడు స్ధానాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవుతాయని అయితే తాను మాత్రం ఖచ్చితంగా నర్సంపేట నుండే పోటీ చేస్తానన్నారు. ఆ మేరకు తనకు ఖచ్చితమైన హామీ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కూటమి అభ్యర్ధుల గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆయన కోరారు.

చిత్రం..మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి