తెలంగాణ

నరకాసుర పాలనను అంతమొందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూర్, నవంబర్ 8: స్వార్థ రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలలో మార్పు తేవడానికే తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేశామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. గురువారం ఉట్నూర్‌లో ఆపార్టీ అభ్యర్థి సట్ర భీం రావు తరుపున పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అర్కాపూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయ్యారన్నారు. ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని బాగు చేస్తాడని కేసీఆర్ చేతిలో పెడితే రాష్ట్ర ప్రజలకు నరకం చూపించి నాలుగేళ్ల పాటు రాక్షస పాలన కొనసాగిందని, ఆ పాలన అంతమొందించడానికి ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకొని ముందుకెళ్తున్నామన్నారు. అవసరం అయితే ఒక్క అడుగు వెనక్కి వేసి సీట్లు వచ్చినా రాకున్నా ముందుకు వెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఖానాపూర్, ఆసిఫాబాద్, చెన్నూర్ నియోజకవర్గాలను టీజే ఎస్‌కు కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ ముందు ఉన్నామని , కానీ పొత్తుల విషయంలో కాలయాపన జరగడం వల్ల నష్టం జరుగుతుందన్నారు. అయినా సరే రాష్ట్ర రాజకీయాలలో మార్పు కోసం రాక్షస పాలనను అంతమొందించడానికి ఒక మెట్టు దిగక తప్పదన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఒక కుటుంబం వైపే తిరుగుతున్నాయని మళ్లీ గడీల పాలన వచ్చే అవకాశం ఉన్నందున చేతకాక నాలుగేళ్లకే రద్దు చేసుకున్న ప్రభుత్వానికి మళ్లీ రాకుండా చూడాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు పంచుతున్నారని , కానీ వంద శాతం అక్రమంగా సంపాదించి, అందులో 99 శాతం మింగేసి ఒక్క శాతమే పంచి పెడుతున్నారన్నారు. అమర వీరుల త్యాగాలను విస్మరించి స్వార్థ పాలన కొనసాగుతుందన్నారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ కోసం తాను కేసీఆర్‌తో జత కట్టానని కానీ ఆయన పాలన ఆంధ్ర పాలనకంటే హీనంగా ఉందన్నారు. ఆదివాసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుంటే, గిరిజన తెగల మధ్య యుద్ధం జరుగుతుంటే ఫాం హౌస్‌లో కూర్చుండి అసలే సమస్యలే పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు ఎన్నో తీర్చామని ప్రకటించిన కేసి ఆర్ అసలు హామీలకు అక్షరాలు ఎన్నో తెలియదన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో శాంతి యుత వాతావరణంలో కొనసాగిస్తు గిరిజన, గిరిజనేతర తెగల మధ్య సోదర భావం పెంపోందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆదివాసీ చట్టాలకు అన్యాయం జరుగకుండా గిరిజనేతర హక్కులను కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. జిసిసి ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉండగా, కేసి ఆర్ మాత్రం తన బాగోగులే చూసుకున్నారన్నారు. 500 నోటు, చేతిలో సీసా పెట్టి ఓట్ల కోసం ఓట్ల పండుగలు చేసుకునేందుకు బిచ్చ గాళ్లు వస్తున్నారని వారి తొక్కి పాతేరేయాలన్నారు. అనంతరం కళాకారులు ధూం ధాం నిర్వహించగా పలువురిని ఆకట్టుకున్నారు. టి జే ఎస్ నాయకులు దుర్గం రాజేశ్వర్ , భీం రావు, చింత స్వామి, రవీందర్, అరికెల అశోక్, నరహారీ, బాసన్న, వినోద్, వెంకటేష్, తికల్ రావు, సంజయ్ రెడ్డి, జగ్గా రెడ్డి, సంజీవ్, వెంకట రవి, శ్యాం సుందర్, మల్లేష్, విజయ్, గోపాల్ పాల్గొన్నారు.
చిత్రం..ప్రచార సభలో ప్రసంగిస్తున్న కోదండరాం