తెలంగాణ

రాష్టప్రతి రాకకోసం ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, డిసెంబర్ 25: అయుత చండీ మహాయాగంలో చివరి రోజైన ఆదివారం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జి వస్తుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్టప్రతి బసచేయనున్న కుటీరాలతో పాటు హెలిప్యాడ్, రోడ్డు మార్గంలో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హెలిక్యాప్టర్ ద్వారా రిహార్సల్ నిర్వహించారు.
క్యూ లైన్‌ను చక్కబెట్టిన మంత్రి హరీశ్, కలెక్టర్ రాస్
జనసంద్రంగా మారిన ఎర్రవల్లి అయుత చండీయాగ శాలలో భక్తులు కిక్కిరిసిపోయి తోపులాటకు దిగడంతో మంత్రి హరీశ్‌రావు మరోమారు తనదైన శైలిలో స్పందించారు. భక్తుల మద్దకు చేరుకుని క్రమశిక్షణ, కట్టుబాటు, నియమ నిష్టలకు ఆలవాలమైన అయుత చండీ మహాయాగాన్ని పవిత్రంగా దర్శించుకోవాలని తోపులాటకు దిగకుండా క్రమపద్దతిలో వెళ్లాలని సర్దిచెప్పారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఉదయం నుంచే క్యూ లైన్ వద్ద ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.
వాహనాలతో పోటెత్తిన రెండు దారులు
ఎర్రవల్లి యాగాన్ని కనులారా వీక్షించడానికి దాదాపు 3 లక్షల మంది భక్తులు వారికి అనుకూలంగా ఉన్న వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెండుదారులపై వాహనాలు పెద్ద సంఖ్యలో దారికట్టాయి. ఒక దశలో ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు.
పార్కింగులుగా మారిన కూల్చిన ఇళ్ల స్థలాలు
ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తున్న ఎర్రవల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం కూల్చివేసిన ఇళ్ల స్థలాలే అయుత చండీ మహాయాగానికి తరలివస్తున్న భక్తుల వాహనాలను నిలపడానికి పార్కింగ్ కేంద్రాలుగా మారాయి. గ్రామంలో ఉన్న 220 పెంకిటిళ్లను డబుల్ బెడ్ రూం ఇళ్లుగా నిర్మించడానికి సిఎం సంకల్పించి మహత్ కార్యక్రమంగా నిర్వహించారు. వీటిని ఇటీవలే జెసిబిలతో కూల్చి నేలను చదును చేసారు. కొన్నింటికి పిల్లర్లు వేయడానికి సైతం అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమైన అయుత చండీ మహాయాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. యాగశాలకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవల్లి గ్రామంతో పాటు శివారు ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడే వాహనాలను నిలుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.