తెలంగాణ

సర్వజన సంక్షేమం టీఆర్‌ఎస్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, నవంబర్ 11: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నది టిఆర్‌ఎస్ అని అందువలను ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళశాల క్రీడమైదానంలో క్రీడాకారులను, మార్నింగ్ వాకర్స్‌ను ఎమ్మెల్యే అభ్యర్ధి భాస్కర్‌రావు కలుసుకోని తనకు ఓటు వేయాలన్నారు. అదేవిధంగా కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సహపరిచి మీ ఓటు తనకే వేయాలని అభ్యర్ధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. క్రీడకారులకు అవసరమైన క్రీడమైదానం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. గత నాలుగున్నర ఏండ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని మిగిలిపోయిన పనులను పూర్తిచేసేందుకు ఈ ఎన్నికలలో మరోసారి తనకు సహకరించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షలు తిరునగరు భార్గవ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ మగ్ధుం పాష, ఎఎంసి వైస్ చైర్మన్ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ, కౌన్సిలర్లు పత్తిపాటి నవాబ్, నాయకులు అన్నబీమోజు నాగార్జునచారి, ఉదయభాస్కర్‌గౌడ్, మల్గం రమేష్, మనె్నం లింగారెడ్డి, కుర్రా విష్ణు, పి.శ్రీనివాస్‌గౌడ్, బంటు రామచంద్రు, పందిరి కృష్ణ, డాక్టర్ అడావత్ నాగేశ్వరరావు, షోయబ్, మాజీద్, కోటేశ్వరరావులు పాల్గొన్నారు. కెసిఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే రాష్ట్రంలోని అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందని మిర్యాలగూడ టిఆర్‌ఎస్ అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ ఎదుట టీ స్టాల్ వద్ద టీ తాగుతూ , రాఘవ ధియోటర్ సమీపంలోని లెబర్ అడ్డ వద్ద కూలీలను కలుసుకోని ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం టిఆర్‌స్ ప్రభుత్వం ప్రత్యేక పధకాలను రూపొందించి అమలుచేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.

చిత్రం..ప్రభుత్వ జూనియర్ కళశాల క్రీడా మైదానంలో వాకర్స్‌ను కలిసి ఓటు అడుగుతున్న అభ్యర్ధి భాస్కర్‌రావు