తెలంగాణ

బడుగువర్గాల సంక్షేమానికి ప్రత్యేక మేనిఫెస్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్/వేల్పూర్, నవంబర్ 11: రాష్ట్రంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారని, దానివల్ల రానున్న రోజుల్లో మరింత మెరుగైన సంక్షేమం అందుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ నడుస్తూ, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో జరిగిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో కడియం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి ఫలాలను అందిస్తూ ముందుకు కదులుతున్న తెరాసకు అండగా నిలవాలని కడియం పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రచించిన సమయంలోనే 70 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించే అంబేద్కర్ ఆర్టికల్-3ను అందులో పొందుపర్చారని, దానివల్లే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని భావించి, సమాజంలోని అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకులాను ఏర్పాటు చేశామన్నారు. 1983లో ఆనాటి ముఖ్యమంత్రి 120 గురుకులాలు ప్రారంభిస్తే, తెరాస అధికారంలోకి వచ్చాక 570 గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 6లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను చదువుకుంటున్నారని, ఇందుకోసం ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు 35 డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. దళితులకు మూడెకరాల భూమి విషయంలో చర్చ జరుగుతోందని, భూమి లేనందున 45 లక్షల రూపాయలు లబ్ధిదారుల పేరిట డిపాజిట్ చేయాలన్న డిమాండ్ వస్తోందని, దీని విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడుతామని అన్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించి, తనకు చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు. త్వరలోనే ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రత్యేక మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 40 లక్షల ఆసరా పెన్షన్లలో 42 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో 20లక్షలు ఎస్సీ, ఎస్టీ లాంటి పేదవర్గాలేనని ఆయన తెలిపారు. ట్యాంక్‌బండ్ సమీపంలో 35 ఎకరాల స్థలంలో అంబేద్కర్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని, 125 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంపీ కవిత మాట్లాడుతూ, దళితుల సంక్షేమం కోసం ఉన్నత విద్యను అందిస్తూనే, స్వయం ఉపాధి కోసం టీఎస్ ప్రైడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 900 కోట్ల పెట్టుబడితో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. 40 శాతం ఉన్న సేల్స్ ట్యాక్స్‌ను ప్రభుత్వం పూర్తిగా తగ్గించిందన్నారు. టీఆర్‌ఎస్ బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు డాక్టర్ మధుశేఖర్, పలువురు దళిత నేతలు ప్రసంగించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ముగ్గురు నేతలను గజమాలతో సన్మానించారు. 11 గ్రామాల దళిత సంఘాలు ప్రశాంత్‌రెడ్డికి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రశాంత్‌రెడ్డి అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
చిత్రం..లక్కోరలో ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి, హాజరైన ఎస్సీలు