తెలంగాణ

విజ్ఞానాన్ని వినియోగించుకోని ఎన్నికల కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ఆధునిక విజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వినియోగించకపోవడం వల్ల దొంగఓట్లు పోలయ్యేందుకు అవకాశం ఏర్పడటమే కాకుండా ఎన్నికల వ్యయం కూడా పెరిగేందుకు అవకాశం ఏర్పడ్డది. బయోమెట్రిక్ విధానాన్ని పోలింగ్‌లో అమలు చేయగలిగితే దొంగఓట్లు పోలయ్యే అవకాశం ఉండదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 12 కోట్ల రూపాయలు ఆదా చేసేందుకు వీలవుతుందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నేడు సాంకేతిక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఈసీఐ మాత్రం వినియోగించుకోలేకపోతోంది. ఓటర్లకు ఐడీ కార్డులు ఇస్తున్న కమిషన్, వీటిని ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా లేదా నేరుగా ఓటర్ ఐడీ కార్డుతోనే ఓటర్ల బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బిహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల సహకారంతో, లేదా ప్రఖ్యాతిగాంచిన ప్రైవేట్ సంస్థల సహకారంతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు వీలవుతుందని తెలుస్తోంది. దొంగఓట్లను నియంత్రించేందుకు, ప్రజాధనం వినియోగించడాన్ని తగ్గించేందుకు బయోమెట్రిక్ విధానం వల్ల వీలవుతుందని నిపుణులు వివరించారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులను వినియోగించేందుకు, సబ్సిడీ బియ్యం తీసుకునేందుకు లబ్దిదారులు తప్పనిసరిగా (వేలిముద్రలను) బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించాల్సిందే. రేషన్ దుకాణానికి వెళ్లే లబ్దిదారుల వేలి ముద్ర సరిపోలకపోతే లబ్దిదారుడికి రేషన్ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 91.81 లక్షల కుటుంబాలకు తెల్లరంగు రేషన్ కార్డు ఉండటంతో వారికి నెలకు మనిషికి ఆరుకిలోల బియ్యం ఇస్తున్నారు. ఒక కుటుంబానికి జారీ చేసిన రేషన్ కార్డుకు సంబంధించి సదరు కుటుంబ సభ్యుల వేలిముద్రలను తీసుకుని బయోమెట్రిక్ విధానంలో స్టోర్ చేశారు. వేలిముద్రలు పదిలపరిచిన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా బయోమెట్రిక్ విధానంలో సరి చూసుకుని రేషన్ ఇస్తున్నారు. ఉపాధికోసం దూరప్రాంతాలకు వెళ్లిన వారు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ విధానంలో రేషన్ బియ్యం తీసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ విధానం అమలు చేయడం వల్ల ఆరులక్షల బోగస్ రేషన్ కార్డులను తొలగించారు. సాంకేతిక విజ్ఞానాన్ని పౌరసరఫరాల శాఖ పూర్తిగా వినియోగిస్తోంది. దాంతో ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఆదా అవుతోంది.
పౌరసరఫరాల శాఖ విజయవంతంగా అమలు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని ఎన్నికల కమిషన్ ఓటర్ల విషయంలో ఎందుకు అమలు చేయలేకపోతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిఓటర్ వేలిముద్రలను ముందుగానే స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓట్లు వేసే సమయంలో ఓటర్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేయడం వల్ల దొంగ ఓట్లు వేసేందుకు ఎవరికీ అవకాశం ఉండదు. పైగా ఈ విధానం అమలు చేయడం వల్ల ఎన్నికల్లో కేవలం తెలంగాణలోనే 12 కోట్ల రూపాయలు పైగా ఆదా చేసేందుకు వీలవుతుంది. రాష్ట్రంలో 32,574 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించాల్సి వస్తోంది. కేవలం ఓటర్ల జాబితాలో పేర్లను తనిఖీ చేసేందుకు, వేలిపై సిరా వేసేందుకు, బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణకు ముగ్గురిని వాడుతున్నారు. బయోమెట్రిక్ విధానం అమలైతే ఈ ముగ్గురి అవసరం ఉండదని స్పష్టమవుతోంది.