తెలంగాణ

రానున్న నెలరోజులు అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ తీసుకున్న విసృత చర్యల నేపథ్యంలో బలగాలను సిద్ధం చేశారు. నేటి నుంచి డిశంబర్ 12వ తేదీ వరకు తెలంగాణలో పోలీస్ పహారా పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టబోతున్నారు. ఎలాంటి ఘటనలను సైతం ఎదుర్కోగలమని పోలీస్ అధికారులు భరోసా ఇస్తున్నారు. రానున్న నెల రోజులు కంటికి నిద్రలేకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాల ఎస్సీలతో టెలీకాన్ఫరెన్స్ మాట్లాడారు. హైదరాబాద్‌లో సీనియర్ పోలీస్ అధికారులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చించారు. మావోయిస్టు కదలికలు ఉన్నాయన్న సమాచారంతో 13 నియోజక వర్గాలను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నాయి. ఈ నియోజక వర్గాల్లోకి వెళ్ళడానికి అనుమతులు ఉంటే తప్పా ముందుకు పోలేరు. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలంటే ముందస్తు సమాచారం పోలీసులకు చెప్పాల్సిందే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను రక్షణగా నియమిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు మూడంచెల వ్యవస్థను అమలు చేయబోతున్నారు. మొదట పోటీ చేస్తన్న అభ్యర్థులకు బందోబస్తు, రెండవది పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రప్పించడం, మూడవది చత్తీష్‌గడ్, మహారాష్టల్ర నుంచి మావోయిస్టలు రాకుండా భద్రతను కట్టుదిట్టం చేసే విషయాలపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 55 వేల మంది పోలీసులను ఎన్నికల బందోబస్తుకు వినియోగించుకోవడం, అలాగే 178 కేంద్ర పారామిలటరీ దళాలను రప్పిస్తున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో 145 చెక్ పోస్టులు వద్ద పోలీస్ జవాన్లు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తారు. బయటి నుంచి వచ్చే వాహనాలను విస్తత్రంగా తనిఖీ చేస్తారు. ముఖ్యంగా మావోలు ఇటీవల రెచ్చగొట్టే ప్రకటనలతో పాటు వాల్‌పోస్టర్లు వేయడం వంటి అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. పోలీస్ వర్సెస్ మావోలు అన్న సంకేతాలు వెళ్ళడంతో ఎజెన్సీ ప్రాంతల్లో బయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోల పిలుపుకు ఎజెన్సీలో గిరిజనుల నిర్ణయం ఏమిటి అన్నది ఇటు పోలీస్ అటు మావోలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల పోలింగ్ రోజు భద్రతను పెంచి ఎజెన్సీ గిరిజనులను ఓటింగ్‌కు తీసుకురావాలని ఎన్నికల అధికారులు బలగాలను సిద్ధం చేస్తున్నారు. తమ పిలుపును ప్రతిఘటిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు బహిరంగ ప్రకటనలు చేయడంతో ఎజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ సమాయాన్ని గంట పాటు ముందుగా కుదించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులకు సూచించింది. పోలింగ్ నిర్వహణ అధికారులు విధుల్లో పాల్గొనడానికి భయపడుతున్నారు. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడితే తమ ప్రాణాల సంగతి ఏమిటని అధికారులు మదనపడుతున్నారు. మావోయిస్టుల కదలికలు ఉన్నాయని 13 అసెంబ్లీ స్థానాలను ఎన్నికల అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూరు, చెన్నూరు. బెల్లింపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లా మంథని, ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం వంటి నియోజక వర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీస్ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీలు ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.

చిత్రం.. డీజీపీ మహేందర్ రెడ్డి