తెలంగాణ

59 మంది నేరచరితులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో సభ్యుల చరిత్రను విశే్లషించిన ఏడీఆర్, టీ- ఎలక్షన్ వాచ్ సంస్థలు దిగ్భ్రాంతికర అంశాలను వెల్లడించాయి. ఈ మేరకు ఈ సంస్థలు ఆరు పేజీల నివేదికను పత్రికలకు విడుదల చేశాయి. 119 ఎమ్మెల్యేల్లో రికార్డులు లభించక తొమ్మిది మంది వివరాలు వెల్లడించలేదు. గువ్వల బాలరాజు, ఎస్‌ఎఎస్ సంపత్‌కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, కల్వకుంట్ల విద్యాసాగరరావు, భట్టి విక్రమార్క, చల్లా ధర్మారెడ్డి, జీ మైపాల్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లను మినహాయించారు. నేరచరిత్ర, ఆర్ధిక సంపత్తి, విద్యాంశాలను, పూర్వ చరిత్రను ఈ రెండు సంస్థలూ విశే్లషించాయి. గత ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా అధ్యయం చేసినట్టు సంస్థ పేర్కొంది. పూర్తి నివేదికను ఏడీఆర్ ఇండియా డాట్ ఆర్గ్ వెబ్ పోర్టల్‌లో ఉంచారు. 119 మందిలో 9 మందిని మినహాయించి 100 మంది నేరచరిత్రను పరిశీలించగా, వారిలో 59 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. 41 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. పార్టీల వారీ చూస్తే 39 మంది టీఆర్‌ఎస్, ఐదుగురు కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ, నలుగురు ఎంఐఎం, ఇద్దరు బీజేపీ మాజీలున్నారు. తీవ్రమైన కేసుల విషయానికొస్తే టీఆర్‌ఎస్‌లో 26 మందిపై, ఇద్దరు కాంగ్రెస్, ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంఐఎం, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఆ విధంగా చూస్తే నేరచరితులున్న వారు టీఆర్‌ఎస్‌లో 64 శాతం, టీడీపీలో 46 శాతం, కాంగ్రెస్‌లో 29 శాతం ఉన్నట్టు తేలింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇప్పటికే హత్య కేసును ఎదుర్కొంటున్నారు. ఆరుగురు టీఆర్‌ఎస్ మాజీలపై హత్యాయత్నం కేసులున్నాయి. బీజేపీలో ఒకరు, టీడీపీ నుండి ఒకరు హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్నారు. 110 మంది ఎమ్మెల్యేల్లో వారిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా చూసేన్త 76 మంది కోటీశ్వరులే. టీఆర్‌ఎస్ నుంచి 40 మంది, 14 మంది కాంగ్రెస్,11 మంది టీడీపీ, నలుగురు ఎంఐఎం, ముగ్గురు బీజేపీ నేతలు కోటీశ్వరులే. ఇద్దరు వైకాపా, ఒక బీఎస్‌పీ , ఒక స్వతంత్ర సభ్యుడు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కోటీశ్వర్లు.
ఇక 36 మంది మాజీ ఎమ్మెల్యేలు ఐదో తరగతి నుండి ఇంటర్ మధ్య చదివిన వారున్నారు. 68 మంది డిగ్రీ పూర్తి చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అక్షరాస్యులుగా పేర్కొన్నారు. 11 మంది 31 నుండి 40 ఏళ్ల ప్రాయం వారు కాగా, 39 మంది 41 నుండి 50 ఏళ్ల ప్రాయం వారున్నారు. 44 మంది ఎమ్మెల్యేల వయస్సు 51 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు కాగా మరో 16 మంది వయస్సు 61 నుండి 70 ఏళ్ల మధ్య ఉంటుంది. 110 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 8 మంది మాత్రమే మహిళలు కావడం విశేషం. ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ తరఫున మేజర్ జనరల్ అనిల్ వర్మ, ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ జగదీప్ చక్కోర్, ఐఐఎం బెంగలూరుకు చెందిన ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్ర్తీ , దుబ్బుడు రాకేష్‌రెడ్డి విశే్లషించారు.