తెలంగాణ

ఎన్నికల తరువాత కూటమి మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 19: వచ్చే వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి కాళేశ్వరం జలాలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మళ్లిస్తామని రాష్ట్ర ఆపద్ధర్మ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తద్వారా నిజాంసాగర్ పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మహాకూటమి మాయమవుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన వర్ని మండలంలోని కారేగాం, కారేగాంతండా, మేడిపల్లి, నడితండా, లక్ష్మీసాగర్‌తండా, సైదాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచార సభల్లో పోచారం మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీలది మహాకూటమి కాదని, అది మాయల కూటమి అని అభివర్ణించారు. ఒకవేళ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపిస్తే, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారని పోచారం అనుమానాలు వెలిబుచ్చారు. అదే తెరాసను గెలిపిస్తే హామీలన్నీ కేసీఆర్ అమలు చేస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సమర్థుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని, ప్రతిపక్షాలలో ఆ స్థాయి నాయకులెవరూ లేరని అన్నారు. సాగునీటి ఇబ్బందులను దూరం చేస్తూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించేందుకు లక్షన్నర కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. కాగా, తాను నిజాంసాగర్ మెయిన్ కెనాల్ పైన ఎత్తిపోతల పథకాన్ని నిర్మింపజేసి వర్ని మండలాన్ని సాగు జలాలతో సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ లిఫ్టు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించగా, ఆయన సానుకూలత వ్యక్తం చేశారని వివరించారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగానే సొంత స్థలం కలిగి ఉన్న వారికి ఇళ్ల నిర్మాణాల కోసం 5లక్షల రూపాయలను అందిస్తామని తెరాస మెనిఫెస్టోలో చేర్చారని చెప్పారు. గిరిజన మహిళలతో కలిసి పోచారం నృత్యం చేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకుడు బద్యానాయక్ ప్రచారంలో పాల్గొన్నారు.

చిత్రం..చిన్నారులతో కలిసి నృత్యం చేస్తున్న పోచారం