తెలంగాణ

నియంత పాలన ఇక వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనకు ఇక చెక్ పడనుంది... కెసిఆర్ నియంత పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని ప్రజా గాయకుడు గద్దర్ ధ్వజమెత్తారు. సోమవారం గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎన్నికల ప్రచార సభలో గద్దర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని ఆశీస్తే కేవలం కెసీఆర్ కుటుంబమే లబ్ధి పొందుతుందని, రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలకు ఈసమెత్తు మేలు జరిగిన దాఖలాలు లేవని అన్నారు. తెరాసా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత 50శాతం ఓట్లున్న మహిళలకు కనీసం ఆ క్యాబినేట్‌లో ఒక్క మంత్రి పదవీ కూడా ఇవ్వలేకపోయాడని... ఇక ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల పెంపు పేరుతో అమలు చేయక పోగా మొండి చెయ్యి చూపారని విమర్శించారు. కెసి ఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యే సమయం వచ్చిందని... ఇక ఆయన యాగాలు, హోమాలు, పూజలు చేసుకోవాల్సిందేనని వ్యంగ్యంగా మాట్లాడారు.

చిత్రం. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న గద్దర్