తెలంగాణ

అది ధృతరాష్ట్ర కౌగిలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 19: ధృతరాష్ట్ర విషకౌగిలి నుంచి మహాకూటమి నేతలు బయటపడడం కష్టమని, చంద్రబాబు లాంటి తెలంగాణ ద్రోహులకు ఇక్కడి ప్రజలు అసలు అవకాశం కల్పించరని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కొట్యాల, మామిడ్యాల, గజ్వేల్‌లకు చెందిన ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఆత్మగౌరవం కలిగిన తెలంగాణ ప్రజలు పరాయి పాలన, పరాయి పెత్తనాన్ని ఎంతమాత్రం సహించరని, ఒకరిపై ఒకరికి విశ్వాసం లేని నేతలతో మహాకూటమి ఏర్పడిందని స్పష్టంచేస్తూ అది కుక్కలు చింపిన విస్తరి కాక తప్పదని విమర్శించారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ పురిటిగడ్డ నిలిచిందని, అయితే ప్రాజెక్టులు అడ్డుకున్నందుకా? తెలంగాణ లోని 7 మండలాలను ఆంద్రాలో కలుపుకున్నందుకా? రైతులను పిట్టల్లా కాల్చి చంపినందుకా? ఎందుకు చంద్రబాబుకు ఓటు వేయాలని మంత్రి హరీష్‌రావు నిలదీశారు. కాగా మహాకూటమి రాష్ట్ర వ్యాప్తం గా డిపాజిట్ దక్కించుకునేందుకు శ్రమించాలే తప్ప సింగిల్ డిజిట్ వచ్చే అవకాశమే లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణతోపాటు గజ్వేల్ ఎవరి చేతులలో పెడితే బాగుపడుతుందో ప్రజలకు తెలుసని, అయితే ప్రతిపక్షాలు మభ్య పెట్టే మాటలు, పక్కదారి పట్టించే తీరును ఎప్పుడో జనం గుర్తించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలుస్తుండగా, గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్‌లలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని చెప్పారు. ఎన్నికల కోసమే రాజకీయం చేస్తున్న ప్రతాప్‌రెడ్డికి ఇక్కడి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టనుండగా, అద్భుతమైన ప్రగతిని సాదించిన కేసీఆర్‌కు గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు పేర్కొన్నారు. మేడ్చెల్‌లో సోనియాగాంధీ సభకు ఏపీ సీఎం చంద్రబాబును పిలవకపోవడంలో అంతర్యమేమిటని నిలదీస్తూ తాము గతంలో ఆయనతో స్నేహం చేసి 10 సీట్లకే పరిమితం కాగా, ప్రస్తుతం కాంగ్రెస్‌కు పరిస్థితి కూడా అంతేనని అన్నారు. టీజేఎస్ చైర్మెన్ కోదండరాంను ఐదేళ్ల పాటు జేఏసీ చైర్మెన్‌గా తాము మోయగా, కాంగ్రెస్ కేవలం 30 రోజులు కూడా మోయలేకపోయిందని ఎద్దేవా చేస్తూ కేటాయించిన సీటును సైతం తిరిగి లాక్కున్న ఘనత ఆ పార్టీకే దక్కిందని స్పష్టం చేశారు. మహాకూటమిలో నేతలు ఆగమాగమవుతూ గందరగోళ పరిస్థితుల్లో ఉండగా, ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోయి బీఫాంలు ఇచ్చుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే బెదిరించిన నేతలకు టికెట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుండగా, క్రమశిక్షణ కలిగిన టీఆర్‌ఎస్‌లో అలాంటి దుస్థితి ఎన్నడూ కూడా నెలకొనదని వివరించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుదాకర్‌రెడ్డి, కార్ప్పొరేషన్ చైర్మన్‌లు భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఊడెం కృష్ణారెడ్డి, రైసస జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.
చిత్రం.. మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నేతలు