రాష్ట్రీయం

రోడ్‌మ్యాప్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: హైదరాబాద్‌లోని ఆంధ్ర సచివాలయం నుంచి ఉద్యోగులు, ఉన్నతాధికారుల తరలింపునకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ అమరావతికి వెళ్లాల్సిన వివిధ శాఖాధిపతులు, ఉద్యోగులపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన్ని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో డెడ్‌లైన్ ముంచుకొస్తుండడంతో ఆదివారం ఉన్నతాధికారులు సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఉద్యోగుల తరలింపుపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదని, అమరావతికి వెళ్లకతప్పదని, ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తనను కలిసిన ఉద్యోగులకు టక్కర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేయబోయే రోడ్ మ్యాప్ ప్రకారం 32 శాఖల్లో 52 పరిపాలన యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగుల తరలింపు రెండు మూడు నెలల్లో దశల వారీగా పూర్తవుతుంది. ఈ రెండు మూడు నెలల్లో వెలగపూడిలో ఉద్యోగుల స్ధానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను వినియోగించుకోనున్నారు. ఒకటి రెండు సంవత్సరాల్లో పదవీవిరమణ చేసే ఉద్యోగులను మాత్రం కదపరు. సచివాలయంలో హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టం చేసింది. తమ పిల్లలకు ఇక్కడ ఎమ్సెట్‌లో మంచి ర్యాంకు వచ్చిదని, విజయవాడ, గుంటూరుకు వెళితే నాన్‌లోకల్ కోటాలో సీట్లు ఎలా వస్తాయని ఉద్యోగులంటున్నారు. అమరావతి ప్రాంతాన్ని స్ధానికత పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టప్రతి, కేంద్ర హోంశాఖ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. రాష్టప్రతి నుంచి ఆమోదం లభించిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం ఢిల్లీలోని ఏపిభవన్ రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ నెలాఖరుకు ఈ నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. ఒక వేళ ఆలస్యమైతే, రాష్ట్రప్రభుత్వమే ఒక నోటిఫికేషన్ ఇచ్చి అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో సీట్లు పెంచి సీట్లు కేటాయించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయమై న్యాయ శాఖ అభిప్రాయాన్ని అడిగారు. న్యాయ శాఖ అభిప్రాయం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో అడ్మిషన్లపై మార్గదర్శకాలను కూడా జారీచేయనున్నారు.
సివిల్ సప్లయిస్‌లో పనిచేస్తున్న సిహెచ్ కృష్ణారావు మాట్లాడుతూ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమరావతిలో అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత తరలించాలన్నారు. ఏపి గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం అధ్యక్షుడు ఏబి పటేల్ మాట్లాడుతూ హెచ్‌ఓడిలను ఈ నెల 27వ తేదీన రిపోర్టు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మరో పది నెలల గడువు ఇస్తే బాగుంటుందన్నారు.
కాగా విద్యుత్ సౌధలో ఉన్న ఏపి ట్రాన్స్‌కో, ఏపి జెన్కోతో పాటు సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్ధల్లో పనిచేస్తున్న మూడు వేల మంది సిబ్బందిని విజయవాడకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. జూలై నెల లోపు ఇక్కడి నుంచి ఆంధ్ర విద్యుత్ సిబ్బది, ఇంజనీర్లు విజయవాడకు వెళ్లేందుకు వీలుగా విద్యుత్ సంస్ధల యాజమాన్యం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది. సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌ను కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు.