తెలంగాణ

నీళ్లు, నియామకాలు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రిని దేశంలో ఎన్నడూ ఎక్కడా చూడలేదని కేసీఆర్‌ను ఉద్దేశించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. మూడు పర్యాయాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఈ సమాచారం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో దేశంలో అభివృద్ధి ఎంతో జరిగిందని స్పష్టం చేశారు. ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని చౌహాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లకుండా క్యాంప్ ఆఫీసు కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేశారని ఆయన విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాడినట్టు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ ఆ మూడింటినీ సాధించిందా? అని ప్రశ్నించారు. డిజైన్లలో మార్పులు పేరుతో అంచనాలను రెట్టింపు చేసి కాంట్రాక్టులు ఇచ్చారని, కానీ సాగు భూమి మాత్రం పెరగలేదని ఆరోపించారు. సాగునీరు లేదు, తాగునీరు లేదు, లక్ష్యాలు కూడా నెరవేరలేదని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు లోటు బడ్జెట్‌లోకి ఎలా వెళ్లిందో అందరికీ తెలుసని శివరాజ్‌సింగ్ చెప్పారు.
నియామకాలు నీళ్లు ఏమయ్యాయో ఇంత వరకూ సీఎం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని, ప్రైవేటు ఉద్యోగాల కల్పన జరగలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డా తర్వాత రాష్ట్రం అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేదని మధ్యప్రదేశ్ సీఎం ధ్వజమెత్తారు. నిజాం రాజులు పోయినా, కొత్త రాజులు తయారయ్యారని, రాజరిక పాలన తెలంగాణలో పోలేదని అన్నారు. ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం గుప్పెట్లోనే ఉందన్న చౌహాన్ ‘ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెత్తనం చేసిన మరో కుటుంబాన్ని నేను చూడలేదు’అని విరుచుకుపడ్డారలు. కాంగ్రెస్‌కన్నా ఎక్కువగా కేసీఆర్ కుటుంబం పాలన జరిగిందని చెప్పారు. ఇన్ని అబద్ధాలు చెప్పే సీఎంను తాను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. దళిత సీఎం పక్కకు పోయి, కేసీఆర్ తానే సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో ప్రధాని ఆవాస్ యోజన విజయవంతం అయిందన్నారు. డబుల్ బెడ్‌రూంలు ఏమయ్యాయని, సీఎం ఆవాస్ యోజన చేస్తే కనీసం చిన్న ఇల్లు అయినా వచ్చేదన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం చేయలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని, ఇలాంటి నియంత పాలన తాను ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.

చిత్రం..హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్